PSLV C54: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్వీ సీ54 విజయవంతమైంది. పీఎస్‌ఎల్వీ సీ-54 రాకెట్ ద్వారా 9 ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు దీనిని ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా ప్రయోగించిన తొమ్మిదింటిలో ఎనిమిది నానో శాటిలైట్లు కావడం గమనార్హం. వీటిని ప్రైవేటు కంపెనీలు తయారు చేశాయి. అలాగే, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ -06ను ఇస్రో అభివృద్ధి చేసింది. భూటాన్‌కు సంబంధించి నానో శాటిలైట్-2 కూడా ప్రయోగించిన వాటిలో ఒకటిగా ఉండడం గమనార్హం. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇది 87వ ప్రయోగం కావడం గమనార్హం.
Cat In Passengers Suitcase: కంగుతిన్న ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. ప్రయాణికుడి సూట్ కేసులో..
పీఎస్‌ఎల్వీ సీ54 ప్రయోగం విజయవంతం కావడంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితమే ఈ విజయమని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నీటి వనరుల పర్యవేక్షణ, తుపాను అంచనా, భూవాతావరణంపై, సముద్రాల మీద వాతావరణంపై ఈ ఉపగ్రహాల ద్వారా అధ్యయనం చేయనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం.. మీథేన్ లీకులు, భూగర్భ చమురు, పంటలకొచ్చే తెగుళ్లను గుర్తించేందుకు ఈ ప్రయోగం దోహదపడుతుందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.