గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శుక్రవారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు వచ్చి రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు రాజీనామా సమర్పించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
హిమాచల్ ప్రదేశ్‌లో 68 అసెంబ్లీ స్థానాలకు గాను 40 స్థానాలను గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్ బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ, పార్టీ అభ్యర్థులు 15 స్థానాల్లో 2,000 కంటే తక్కువ మెజారిటీతోనే విజయం సాధించడం గమనార్హం.
బంగ్లాదేశ్‌తో రేపు జరిగే మూడో వన్డేలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను చేర్చినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించింది. ఆతిథ్య బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 0-2తో కోల్పోయింది. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ కుల్దీప్ యాదవ్‌ను చివరి వన్డే కోసం భారత జట్టులో చేర్చింది.
మానాలు సాధారణంగా శుద్ధమైన ప్రత్యేక పెట్రోల్‌తో నడుస్తాయి. దీనిని విమాన ఇంధనమని పిలుస్తారు. ఉక్రెయిన్-రష్యా యుద్దం కారణంగా ధరలు భారీగా పెరగడంతో వంట నూనెల పేరు వింటేనే జనం జంకే పరిస్థితి. వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. విమానయాన రంగంలో సంచలన మలుపుగా వంట నూనెతో నడిచిన విమానం ఆకాశంలోకి ఎగురుతోంది.
తన జీవిత భాగస్వామిని హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని సాకేత్ కోర్టు శుక్రవారం మరో 14 రోజులు పొడిగించింది. అతన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.
2019లో పంజాబ్‌లోని తరన్ తారణ్ ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడు కేసులో వాంటెడ్‌గా ఉన్న బిక్రమ్‌జిత్ సింగ్‌ను ఆస్ట్రియా నుంచి రప్పించి ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం అదుపులోకి తీసుకున్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు.
వారిద్దరికీ విడివిడిగా వివాహాలయ్యాయి. చుట్టాలు కావడం వల్ల తరచూ ఒకరి ఇంటికి ఒకరు వెళ్తూ ఉంటారు. అలా వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతోంది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో పెళ్లి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. భుంగ్రా గ్రామంలో గురువారం జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడులో ఐదుగురు వ్యక్తులు మరణించారు.
17 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆ గడ్డపై టెస్టు సిరీస్ ఆడడానికి వచ్చిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో అద్భుత విజయం సాధించి రెండో టెస్టుకు సన్నద్ధం అవుతున్న సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.