PM Narendra Modi: గుజరాత్ ప్రజలు బీజేపీవైపే.. హిమాచల్‌లో ఒక్క శాతం ఓట్లతోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: గుజరాత్ ప్రజలు బీజేపీవైపేనని మరోసారి నిరూపించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన అనంతరం ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్జా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. గుజరాత్ ఎన్నికల్లో భారీ విజయం నేపథ్యంలో ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగించారు. ప్రజల ఆశీర్వాదం వల్లే మళ్లీ గెలిచామని ప్రధాని స్పష్టం చేశారు. గుజరాత్ ప్రజలు బీజేపీవైపేనని నిరూపించారన్నారు. బీజేపీ కార్యకర్తల కష్టానికి ఫలితం కనిపిస్తుందని తెలిపారు. ఉత్తర ప్రదేశ్, బీహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటిందన్నారు. హిమాచల్‌లో ఒక శాతం ఓట్లే గెలుపోటములను డిసైడ్ చేశాయని తెలిపారు. హిమాచల్ అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయం సాధించడంతో బీజేపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులతో కలిసి ప్రధాని మోదీ ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
Election Results 2022: గుజరాత్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయం.. హిమాచల్‌లో కాంగ్రెస్‌దే పీఠం
Also Read
- Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
- Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. ఏ పోల్ బూత్‌లోనూ రీపోలింగ్ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఓటర్లకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేవలం ఒకశాతం ఓట్లతో బీజేపీ రెండోస్థానంలో ఉందన్నారు. గుజరాత్ చరిత్రలో బీజేపీకి అతిపెద్ద విజయం నేపథ్యంలో చాలా రికార్డులను కమలం పార్టీ బద్దలు కొట్టిందన్నారు. దేశం ముందు సవాలు ఎదురైనప్పుడల్లా ప్రజలు బీజేపీపై విశ్వాసం చూపిస్తారని గుజరాత్ ఫలితాలు రుజువుచేశాయన్నారు. కుటుంబ రాజకీయాలు, అవినీతిపై వ్యతిరేకత పెరుగుతోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
#WATCH | I had told the people of Gujarat that this time Narendra's record should be broken. I promised that Narendra will work hard so that Bhupendra can break Narendra's record. Gujarat has broken all records by giving the biggest mandate to BJP in the history of Gujarat: PM pic.twitter.com/8Fb530xRLk
— ANI (@ANI) December 8, 2022
తాజావార్తలు
-
Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
-
TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ కీలక చర్య
-
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
-
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!