Rivaba Jadeja: రివాబా జడేజా భారీ మెజార్టీతో ఘనవిజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rivaba Jadeja: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు విజయాన్ని సాధించింది. మొత్తం 182 స్థానాలకు గానూ 156 స్థానాల్లో గెలుపొంది రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ ఎన్నికల్లో జూమ్ నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. రివాబా జడేజా ఘనవిజయం సాధించింది. ఆమె తన ప్రత్యర్థి పై 61 వేలకు పైగా భారీ మెజారిటీ సాధించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. క్షత్రియ ప్రాబల్యం ఉన్న ఈ స్థానంలో రవీంద్ర జడేజా భార్య భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బిపేంద్రసింగ్ జడేజా పోటీ చేశారు. రివాబాకు సొంత కుటుంబం నుంచే వ్యతిరేకత ఎదురైనా సరే వాటన్నింటిని ఎదుర్కొని విజయం సాధించారు.
Gujarat Election Results: గుజరాత్‌లో కాంగ్రెస్ ఇన్‌ఛార్జి రఘుశర్మ రాజీనామా
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
సెప్టెంబర్ 5, 1990లో జన్మించిన రివాబా జడేజా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని ఆత్మీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. ఆమె ఏప్రిల్ 17, 2016న క్రికెటర్ రవీంద్ర జడేజాను వివాహం చేసుకుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా 57 శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కర్షన్‌భాయ్ కర్మూర్ 23 శాతం ఓట్లతో ఆమెకు సమీప పోటీదారుగా నిలవగా, కాంగ్రెస్‌కు చెందిన బిపేంద్రసింగ్ చతుర్‌సిన్హ్ జడేజా 15.5 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అనుభవజ్ఞుడైన హరి సింగ్ సోలంకి బంధువు, రివాబా జడేజా 2019 లో బీజేపీలో చేరారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!