G20 Summit 2023: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2023 సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరిగే G20 సదస్సులో పాల్గొనే అవకాశం ఉందని రష్యాకు చెందిన జీ20 షెర్పా స్వెత్లానా లుకాష్ తెలిపారు. ఖచ్చితంగా రష్యా అధ్యక్షుడు వెళతారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే సదస్సుకు ఇంకా చాలా సమయం ఉన్నందున.. పుతిన్ నిర్ణయం తీసుకుంటారనని లుకాష్ రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్‌తో అన్నారు.
భారత నిర్వాహకులు ప్రకటించినట్లుగా.. న్యూఢిల్లీలో జీ20 నాయకుల సమావేశం సెప్టెంబర్ 9-10, 2023లో జరగాల్సి ఉందని లుకాష్ గుర్తు చేసుకున్నారు. డిసెంబరు 1న ఇండోనేషియా నుంచి జీ20 అధ్యక్ష పదవిని భారత్ చేజిక్కించుకుంది. ఇండోనేషియాలో జరిగిన జీ20 సదస్సుకు పుతిన్ గైర్హాజరయ్యారు. G20 అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో, భారతదేశం దేశవ్యాప్తంగా దాదాపు 200 ఈవెంట్‌లను నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది జరిగే సమ్మిట్‌కు రష్యా అధ్యక్షుడు హాజరవుతారని తాను ఆశాభావంతో ఉన్నానని, అయితే, తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సింది ఆయనేనని లుకాష్ అన్నారు.
Mandous Cyclone: తిరుపతి, చిత్తూరులో కుంభవృష్టి.. సాయంత్రానికి వాయుగుండం
రష్యా G20 షెర్పా మాట్లాడుతూ.. తన దేశం ఒక్క ఈవెంట్‌ను కూడా కోల్పోదని తాను ఆశిస్తున్నానన్నారు. డిసెంబరు 5న ఉదయపూర్‌లో భారత అధ్యక్షతన జరిగిన మొదటి G20 షెర్పా సమావేశం జరిగిందని ఆమె తెలిపారు. అక్కడ డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు వృద్ధి, అభివృద్ధికి కీలకమైన డ్రైవర్లుగా ఉన్నాయని లుకాష్ చెప్పారు.