Road Accident: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం విద్యార్థుల బృందం ప్రయాణిస్తున్న కారు మరో రెండు వాహనాలను ఢీకొనడంతో కనీసం ఐదుగురు కళాశాల విద్యార్థులు మరణించగా.. మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సిన్నార్ సమీపంలోని మోహదరి ఘాట్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని ఓ అధికారి తెలిపారు.
Love Tragedy: లవర్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని గన్‌తో కాల్చుకున్నాడు
18-20 సంవత్సరాల వయస్సు గల ఎనిమిది మంది కళాశాల విద్యార్థుల బృందం నాసిక్ నుంచి సిన్నార్‌కు వెళుతుండగా.. అతి వేగంగా వచ్చిన వారి కారు లేన్‌ను దాటి ఎదురుగా వస్తున్న మరో రెండు కార్లను ఢీకొట్టిందని అధికారి తెలిపారు. ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారని, ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయని తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారి తెలిపారు.