Lawrence Bishnoi Gang: స్థానికుడిని చంపడానికి రూ. 10 లక్షల సుపారీ తీసుకున్న ఇద్దరు షార్ప్ షూటర్లతో సహా ఐదుగురిని అంబాలా పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 20, 2022న తనకు ప్రాణహాని ఉందని ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన మహిందర్ సింగ్, రమేష్ అనే ఇద్దరు షార్ప్ షూటర్లను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Aam Admi Party: రాజస్థాన్ ఎన్నికల్లోనూ ఆప్.. 200 స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు
జనవరి 2న వారిని అరెస్టు చేశామని, లీడ్స్ ఆధారంగా మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఏఎస్పీ పూజా దబ్లా తెలిపారు. స్థానికుడిని హత్య చేసేందుకు నిందితులు రూ.10 లక్షలు తీసుకున్నారని ఆమె తెలిపారు. దేశంలో తయారు చేసిన పిస్టల్, లైవ్ కాట్రిడ్జ్, కారు, రెక్కీ కోసం ఉపయోగించే మోటారుసైకిల్ వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఆమె తెలిపారు.