Extra Marital Affair: వివాహేతర సంబంధాల మోజులో పడి జనాలు తమ సంసారాల్ని కూల్చుకుంటున్నారు. భాగస్వామ్యుల్ని చంపుకుంటున్నారు. ఆ తర్వాత జరిగే పర్యావసానాలు, కుటుంబ విలువల్ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. అడ్డుగా ఉన్నారని.. ప్లాన్స్ వేసి మరీ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీలో తన ప్రేమికురాలి భర్తను హత్య చేసి మృతదేహానికి నిప్పంటించిన 27 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని వజీరాబాద్‌కు చెందిన మునిషద్దీన్‌గా గుర్తించారు. మృతుడు రషీద్ భార్యతో మునిషద్దీన్ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని, రషీద్‌కు అతడు స్నేహితుడని పోలీసులు తెలిపారు.
వజీరాబాద్‌లోని రామ్‌ఘాట్ ఎదురుగా కాలిపోయిన వ్యక్తి మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందింది. శరీరం 90 శాతం కాలిపోయిందని వారు తెలిపారు. ఘటనాస్థలికి సమీపంలోని పొదల్లో కూడా రక్తం కనిపించింది. ఘటనా స్థలం నుంచి పేపర్ కట్టర్, అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు వజీరాబాద్‌కు చెందిన మునిషద్దీన్‌గా గుర్తించామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా మృతుడితో పాటు ఓ వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తిని మునిషద్దీన్‌గా గుర్తించారు.
China: మూడేళ్ల తర్వాత యధాస్థితికి చైనా.. సాధారణ వ్యాధుల జాబితాలోకి కోవిడ్
నిందితుడు మునిషద్దీన్ తెల్లవారుజామున రోహిణి సెక్టార్-16లోని బవానా రోడ్డు దగ్గరకు వస్తాడని పోలీసులకు సమాచారం అందగా.. వలపన్ని అతడిని పట్టుకున్నట్లు స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) రవీంద్ర సింగ్ యాదవ్ తెలిపారు. మునిషద్దీన్, రషీద్‌లు ప్లంబర్, ఎలక్ట్రీషియన్‌గా కలిసి పనిచేశారు. సన్నిహిత మిత్రులయ్యారు. వారు ఒకరి ఇళ్లను సందర్శించడం కూడా ప్రారంభించారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మునీషద్దీన్, మృతుడి భార్య మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. రషీద్ తన భార్యను మద్యం సేవించి కొట్టేవాడని, దీంతో మునిషద్దీన్, మహిళ హత్యకు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. గత 10-15 రోజులుగా రషీద్‌ను వదిలించుకోవాలని మునిషద్దీన్‌పై ఒత్తిడి తెచ్చింది. రషీద్‌ను అంతమొందించేందుకు ఇద్దరూ కుట్ర పన్నారు. వారి ప్రణాళిక ప్రకారం, మునిషద్దీన్ రషీద్‌ను రామ్‌ఘాట్‌కు తీసుకెళ్లి అక్కడ మద్యం సేవించాడని, మునిషద్దీన్ మద్యం మత్తులో రషీద్‌ను పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. అనంతరం గొంతు కోసి మృతదేహాన్ని తగులబెట్టాడు. నిందితులు అన్ని సాక్ష్యాలను, మృతుడి గుర్తింపును ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని వారు తెలిపారు.