హర్యానాలో గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. గురుగ్రామ్‌లోని బాద్‌షాపూర్ ప్రాంతంలో ఆరేళ్ల బాలుడిపై అతని పొరుగున ఉండే 13 ఏళ్ల బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు సోమవారం తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో ఓ రెవెన్యూ అధికారి తన అరాచకత్వాన్ని ప్రదర్శించారు. చిన్నారి అత్యాచారం కేసులో వచ్చిన 5 లక్షల ఎక్స్ గ్రేషియాలో సంగారెడ్డి జిల్లా సీనియర్ అసిస్టెంట్ వాటా అడిగాడు.
రిమోట్ ఓటింగ్ విధానాన్ని బీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఆ పద్ధతి దేశంలో అవసరం లేదన్నారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తెలంగాణ రాష్ట్రానికి తొలిరోజే కీలక విజయం లభించింది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలకు అడ్డాగా ఉన్న భాగ్యనగరంలో మరో అంతర్జాతీయ సంస్థ కొలువుదీరనుంది.
ఆ బాలుడిది ఆడుతూపాడుతూ గడిపే వయసు. అంగవైకల్యం ఆ ఎనిమిదేళ్ల బాలుడి జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ బాలుడి బాధను చూసి ఆ కన్న హృదయం కన్నీరుమున్నీరైంది. ఆ బాలుడి కారుణ్య మరణం కోసం దరఖాస్తు చేసుకుందామని భార్యపై బాలుడి తండ్రి ఒత్తిడి తెచ్చాడు
కర్ణాటకలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను ప్రారంభించింది. ఈ సందర్భంగా తాము గనుక అధికారంలోకి వస్తే ప్రతి మహిళ కుటుంబానికి రూ. 2,000 నెల నెలా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
ఖమ్మంలో ఈ నెల 18న కనీవినీ ఎరగని స్థాయిలో బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దేశం మెచ్చేలా సభకు సన్నాహాలు చేస్తోంది. సభకు రెండు రోజుల ముందే ఖమ్మం నగరం భారీ కటౌట్లు, హోర్డింగ్‌లతో గులాబిమయమైంది.
హైదరాబాద్ నగరంలో పండుగ పూట విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ గల తార్నాకలోని రూపాలి అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది.