California Shooting: కాలిఫోర్నియాలో కాల్పులు.. 6 నెలల పాపతో సహా ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
California Shooting: అమెరికాలోని కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. గన్ కల్చర్ అమెరికాలో మరోసారి సామాన్యపౌరుల ప్రాణాలు తీసింది. కాలిఫోర్నియాలోని ఓ ఇంటిపై సోమవారం తెల్లవారుజామున ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఆరు నెలల పాప, ఆమె తల్లితో సహా ఆరుగురు మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ కాల్పులు మాదకద్రవ్యాల ముఠాతో ముడిపడి ఉండొచ్చని తులారే కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి చెందిన షెరీఫ్ మైక్ బౌడ్రేక్స్ వివరించారు.
సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అనేకసార్లు కాల్పులు జరిపి ఇంటిపై దాడి చేసినట్లు తాము భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ‘‘ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు అనుమానితుల కోసం గాలిస్తున్నాం. ఈ హత్యలకు ముఠాలతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసి ఉండొచ్చు’’ అని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు భవనం లోపల దాక్కుని దాడి నుంచి బయటపడ్డారు. అయితే చాలా మంది క్షతగాత్రులకు స్థానికులు అత్యవసర వైద్య సహాయం అందించారు. క్షతగాత్రులలో ఒకరు ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందారు. ఈ దాడి డ్రగ్స్‌కు సంబంధించిందని అని షెరీఫ్ తెలిపారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన చర్య కాదని.. కావాలనే ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి కాల్పులు జరిపినట్లు తాము భావిస్తున్నామన్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో 2021లో తుపాకీ కాల్పుల వల్ల సుమారు 49,000 మంది మరణించారు. దేశంలో ప్రజల కంటే ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి. ముగ్గురిలో ఒకరు కనీసం ఒక ఆయుధాన్ని కలిగి ఉంటారు.
Also Read
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
Dogs Wedding: సన్నాయి మేళాలు, డీజే చప్పుళ్ల మధ్య కుక్కలకు పెళ్లి.. సోషల్ మీడియాలో వైరల్
ఇదిలా ఉండగా కెనడాలో కూడా కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం ఓ ఆగంతుకుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపగా అతడు కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!