ముంబైలో బాంబు దాడికి పాల్పడతామంటూ ముంబైలో ఉగ్రదాడి చేస్తామని బెదిరిస్తూ తాలిబానీ సభ్యుడిగా పేర్కొంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మెయిల్ అందిందని పోలీసు వర్గాలు ఇవాళ తెలిపాయి.
అయోధ్య రామమందిరాన్ని బాంబులతో కూల్చేస్తామని ఓ ఆగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఆలయాన్ని పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
అసోంలో నేటి నుంచి బాల్య వివాహాలపై భారీ అణచివేతను ప్రారంభించనుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. బాల్య వివాహాలపై అసోం ప్రభుత్వం శుక్రవారం నుంచి భారీ అణిచివేత, నేరస్థులను అరెస్టు చేయడంతోపాటు విస్తృతమైన అవగాహన ప్రచారాన్ని చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.
అబుదాబి నుంచి కోజికోడ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్‌లలో ఒకదానిలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ప్రముఖ సినీ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల రాజకీయ, సినీ, పలు రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. కళాతపస్వి మృతికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సంతాపం తెలిపారు.
అల్లుడా మజాకా... అన్నట్లు కొత్త దంపతులకు కలకాలం గుర్తుండేలా పసందైన విందు ఇచ్చారు అత్తింటివారు. తొలిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడికి 108 రకాల వంటకాలు చేసి వడ్డించి అత్తింటి వారి మర్యాదలు ఎలా ఉంటాయో రుచి చూపించారు.