ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇంటికి మంటలు అంటుకోవడంతో ఆ అగ్నికీలల్లో మూడేళ్ల చిన్నారి సజీవ దహనమైంది. మూడేళ్ల బాలిక తన ఇంటి పైకప్పుకు నిప్పంటుకోవడంతో సజీవ దహనమైందని పోలీసులు ఆదివారం తెలిపారు.
ముంబైలోని వర్లీ అసెంబ్లీ స్థానంలో ధైర్యం ఉంటే తనపై ఎన్నికల్లో పోటీ చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకి శివసేన (ఉద్ధవ్ బాల్ థాక్రే) నాయకుడు ఆదిత్య థాకరే సవాల్ విసిరారు.
ఎన్నికల నేపథ్యంలో త్రిపురలో జరిగిన ర్యాలీలో అసోం ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలోని రామజన్మభూమిలో బాబర్ ఆక్రమణను తొలగించి బీజేపీ రామమందిరాన్ని నిర్మించిందని బనమాలిపూర్‌లో జరిగిన బహిరంగ సభలో హిమంత బిస్వా శర్మ అన్నారు.
దాయాది దేశమైన పాకిస్తాన్ నూతన బిల్లును సిద్ధం చేసింది. సైన్యం, న్యాయవ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష విధించనుంది. పాకిస్తాన్ ప్రభుత్వం క్రిమినల్ చట్టాన్ని మార్చాలని ప్రతిపాదించిన బిల్లును సిద్ధం చేసింది.
వికీపీడియా వెబ్‌సైట్‌ను పాకిస్థాన్ బ్లాక్ చేసింది. అభ్యంతరకరమైన లేదా దైవదూషణ విషయాలను తొలగించడానికి వెబ్‌సైట్ నిరాకరించడంతో పాకిస్తాన్ వికీపీడియాను బ్లాక్ చేసింది.
తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తితో ఆస్తి వివాదంపై క్రిమినల్ బెదిరింపు, కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూడా, తనను తప్పుడు కేసులో ఇరికిస్తున్నారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై మండిపడ్డారు.
అసోం ప్రభుత్వం బాల్య వివాహాలపై పెద్దఎత్తున అణచివేత ప్రారంభించడంతో తమ భర్తలు, కుమారులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఇన్‌ఛార్జిగా బీజేపీ శనివారం నియమించింది. కర్ణాటకలో మరోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ ఇప్పటినుంచే పావులు కదుపుతోంది.
వృత్తిపరమైన శిక్షణ కోసం స్కూల్ ప్రిన్సిపాల్స్‌ను సింగపూర్ పంపించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శనివారం 36 మంది ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సింగపూర్ పర్యటనను జెండా ఊపి ప్రారంభించారు.