Aaditya Thackeray: ముంబైలోని వర్లీ అసెంబ్లీ స్థానంలో ధైర్యం ఉంటే తనపై ఎన్నికల్లో పోటీ చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకి శివసేన (ఉద్ధవ్ బాల్ థాక్రే) నాయకుడు ఆదిత్య థాకరే సవాల్ విసిరారు. ఓ పార్టీ కార్యక్రమంలో ఆదిత్య థాక్రే మాట్లాడుతూ.. తన తండ్రి ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన ఇతర సేన ఎమ్మెల్యేలు, ఎంపీలను ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్లీ ఓటర్లను ఎదుర్కోవాలన్నారు.
Himanta Biswa Sarma: బాబర్ ఆక్రమణను తొలగించి రామమందిరాన్ని నిర్మించాం..
వర్లీ నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. ధైర్యం ఉంటే ఆ రాజ్యాంగ విరుద్ధమైన ముఖ్యమంత్రి తనపై ఎన్నికల్లో పోటీ చేయాలని ఆదిత్ర థాక్రే సవాల్ విసిరారు. వర్లీ నుంచి ఎలా గెలుస్తారో చూద్దామని ఆయన అన్నారు. 13 మంది తిరుగుబాటు ఎంపీలు, 40 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయమని, వారు మళ్లీ గెలుస్తారో లేదో చూడాలని ఆయన సవాల్ చేశారు. జూన్ 2022లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టి షిండే ముఖ్యమంత్రి అయ్యారు.