House Catches Fire: ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇంటికి మంటలు అంటుకోవడంతో ఆ అగ్నికీలల్లో మూడేళ్ల చిన్నారి సజీవ దహనమైంది. మూడేళ్ల బాలిక తన ఇంటి పైకప్పుకు నిప్పంటుకోవడంతో సజీవ దహనమైందని పోలీసులు ఆదివారం తెలిపారు. యూపీలోని బహదూర్‌పూర్ గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి గడ్డితో కూడిన గుడిసెలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. రాంబాబుకు మూడేళ్ల కుమార్తె నందిని ఉంది. ఆ చిన్నారి ఇంట్లో ఉండగా.. ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పంటుకుంది. ఆ సమయంలో ఆ గుడిసెలో చిన్నారి మాత్రమే ఉన్నట్లు తెలిసింది. రాంబాబు మూడేళ్ల కుమార్తె నందిని ఆ గుడిసెలో నిద్రిస్తోంది.
Dead Body In Fridge: రెండేళ్లుగా తల్లి శవాన్ని ఫ్రిజ్లోనే పెట్టిన కూతురు
మంటలు వెంటనే గుడిసె మొత్తాన్ని వ్యాపించాయి. ఆ చిన్నారి మంటల్లోనే సజీవదహనమైందని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సమర్ బహదూర్ సింగ్ వెల్లడించారు. ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ ఆ చిన్నారిని కాపాడలేకపోయారు. అయితే మంటలను అదుపులోకి తెచ్చే సమయానికి, బాలిక, సమీపంలో ఉన్న కట్టెకు కట్టేసి ఉన్న ఆవు కూడా ఆ మంటల్లో సజీవదహనం అయింది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్నారి మంటల్లో కాలిపోవడంతో ఆ కుటుంబాన్ని విషాద ఛాయలు అలుముకున్నాయి.