Woman Birth to Five Children: మహిళలు కవల పిల్లలకు జన్మనివ్వడం సాధారణ విషయమే, కొందరు మహిళలు ఒకే సారి ముగ్గురు లేదా నలుగురు పిల్లలకు జన్మనిస్తుంటారు. అయితే ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. పోలాండ్‌లోని క్రాకో నగరంలో ఓ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఇప్పటికే ఏడుగురు పిల్లలు ఉన్న పోలిష్-బ్రిటీష్ తల్లిదండ్రులు ప్రేమికుల దినోత్సవం రోజునే ఐదుగురు శిశువులను స్వాగతించారు. తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తల్లి మంగళవారం చెప్పింది.
డొమినికా క్లార్క్‌కు ఇప్పటికే 10 నెలల నుంచి 12 ఏళ్ల వయస్సు గల ఏడుగురు పిల్లలు ఉన్నారు. ఆమె మరో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. తాము ఎనిమిదో బిడ్డను కనాలని ప్లాన్ చేశాం.. కానీ కడుపులో ఇంకా ఎక్కువ మంది ఉన్నారని ప్రసవానికి ముందు ఆమె తన భర్త విన్స్‌తో కలిసి ఆస్పత్రిలో విలేకరులతో అన్నారు. పిల్లలు 29 వారాలకు సిజేరియన్ ద్వారా ప్రసవించబడ్డారు. ఆ పిల్లలకు కృత్రిమ శ్వాసకోశ మద్దతు అవసరమైంది. ఆదివారం ఆమె డెలివరీ కాగా.. మంగళవారం ఆమెను, పిల్లలను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
Catholic Church : చర్చిలో చిన్నారులపై లైంగిక వేధింపులు.. మతపెద్దలే నిందితులు
పిల్లల్లో ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వారికి అరియానా డైసీ, చార్లెస్ పాట్రిక్, ఎలిజబెత్ మే, ఇవాంజెలిన్ రోజ్, హెన్రీ జేమ్స్ అని పేరు పెట్టారు. ఇలా ఒకే కాన్పులో ఐదుగురు జన్మించడం అనేది చాలా అరుదు. ఎందుకంటే ఆసుపత్రిలో 52 మిలియన్లలో ఒకరికి ఐదుగురు పిల్లలు పుట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.