Love Letter: వరల్డ్ ఫేమస్ లవర్.. 1999 పేజీలతో భారీ ప్రేమలేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Letter: ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలిపేందుకు సాధారణంగా ప్రేమలేఖలు రాస్తుంటారు. అది సాధారణమైన విషయమే. కానీ ఓ వ్యక్తి మాత్రం తను ప్రేమించి పెళ్లాడిన భార్యకు భారీ ప్రేమలేఖను రాశాడండోయ్. భారీ లేఖ అంటే 10 పేజీలో.. 20 పేజీలో కాదు.. ఏకంగా 1999 పేజీల లేఖను రాసి తన భార్యపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాకు చెందిన జీవన్‌సింగ్ బిష్ట్(63) అనే వ్యక్తి సాధారణ ప్రేమలేఖలకు భిన్నంగా 1999 పేజీల ప్రేమలేఖ రాసి వరల్డ్ ఫేమస్ లవర్ అని నిరూపించుకున్నారు.
ఉత్తరాఖండ్ అల్మోడా జిల్లాలోని చాపఢ్ గ్రామానికి చెందిన జీవన్‌సింగ్ బిష్ట్.. అదే గ్రామానికి చెందిన కమలను చూసి చిన్నతనంలోనే తన మనసులో ప్రేమ చిగురించింది. అనంతరం ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి మరింత ప్రేమించుకున్నారు. ఎంతలా అంటే తనప్రేమను 1999 పేజీల లేఖలో తెలిపేంత. ఆ ప్రేమలేఖను దాదాపు 3 నెలల 3రోజుల సమయం తీసుకొని, 111 పెన్నులతో 8 కిలోల బరువు ఉండే భారీ ప్రేమలేఖను రాశారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలను కలిగిన ఈ ప్రేమలేఖను జీవన్ ఎవరికి రాశారో.. ఆమెనే పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. అనంతరం జీవన్‌కు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఆదాయపు పన్ను శాఖలో జాబ్ రావడంతో .. కుటుంబాన్ని అక్కడికి మార్చాడు. ఇప్పుడు వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
Mexico: ప్రేమికుల రోజు.. ఒక్కటైన వందలాది స్వలింగ జంటలు
కానీ రోజుల అనంతరం 1999లో కుటుంబ పరిస్థితుల వల్ల కమల పిల్లలతో కలిసి తిరిగి గ్రామానికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న తాను తన భార్య మీద ఉన్న ప్రేమను తెలిపేలా ప్రత్యేకమైన ప్రేమలేఖ రాయాలని అనుకున్నానని జీవన్ సింగ్ చెప్పారు. అలా ఉద్యోగంలో ఉండగానే ఆయన ప్రేమలేఖను రాయడం ప్రారంభించారు. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి రావడం.. సాయంత్రం ఇంటికి వచ్చాక పనులు చూసుకొని, ప్రేమలేఖ రాయడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రేమలేఖ రాయడానికి వారం రోజులు సెలవు కూడా తీసుకున్నారు. అలా తాను చెప్పాలనుకున్న మాటలు, వ్యక్తపరచాలని అనుకున్న భావాలకు అక్షర రూపం ఇస్తూ వచ్చారు. ఎన్ని ఇబ్బందులైనా లేఖ రాయడం మాత్రం వదల్లేదు.
ప్రేమలేఖను రాసేందుకు 3 నెలల 3 రోజుల సమయం పట్టింది. దాదాపు 111 పెన్నులు ఉపయోగించి.. ప్రేమలేఖలోని ఒక్కో పేజీలో సగటు 3200పదాలు వచ్చేలా ఈ ప్రేమలేఖను రాశారు. ఈ ప్రేమలేఖలో మొత్తం 10 లక్షలకు పైగా పదాలు ఉన్నాయి. ఈ భారీ ప్రేమలేఖను చాపఢ్‌లో ఉన్న తన భార్యకు పోస్ట్ ద్వారా పంపించారు. అప్పట్లో ఈ ప్రేమలేఖ డెలివరీ చేయడానికి రూ.700 ఖర్చు అయినట్లు వివరించారు. ఈ ప్రేమలేఖను అందుకున్న కమల చాలా సంతోషించిందని.. తిరిగి తనకు కూడా లేఖ పంపినట్లు జీవన్ సింగ్ తెలిపారు. ఈ భారీ ప్రేమలేఖ ప్రపంచంలోనే పెద్దదని ఆయన చెప్పారు. జీవన్ సింగ్ తన భార్యకు రాసిన భారీ ప్రేమలేఖలో అనేక దేశాల విశేషాలను రాశారు. ప్రపంచంలోని వివిధ ప్రదేశాలు, వ్యక్తులతో పాటు దేశంలో జరుగుతున్న పలు ఘటనల గురించి కూడా ప్రస్తావించారు. ఏళ్లు గడిచినా వారిద్దరి మధ్య ప్రేమ మాత్రం అలానే ఉంది. ఈ భారీ ప్రేమలేఖతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు దక్కించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!