Cheating Case: విదేశీ ప్రయాణ ప్యాకేజీలు ఇప్పిస్తానంటూ పలు రాష్ట్రాల్లో వందలాది మంది వైద్యులను మోసం చేసి కోట్లాది రూపాయలను దోచుకున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు మంగళవారం తెలిపారు. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీకి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా గుర్తించిన నిందితుడిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన సైబర్ క్రైమ్ బృందం నోయిడా యూనిట్ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
నోయిడాలోని నోయిడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ రీటా యాదవ్ మాట్లాడుతూ.. విశాల్ పాండే (31)పై గ్రేటర్ నోయిడాకు చెందిన ఒక వైద్యుడు తన వద్ద రూ.18.72 లక్షల మోసం చేశాడని ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. “విశాల్ పాండే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్‌లో ఎఫ్‌ఎస్‌ఓగా పనిచేశాడు. కానీ 2017లో నోట్ల రద్దు తర్వాత ఉద్యోగం కోల్పోయాడు. అతను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యాడు. అనంతరం ఎంబీఏ కూడా చేశాడు. అతను పశ్చిమ బెంగాల్‌లోని బర్ద్‌మాన్ జిల్లాకు చెందినవాడని రీటా యాదవ్ వెల్లడించారు.
Guinness World Record: లిప్ కిస్ పెట్టుకున్నారు.. వరల్డ్ రికార్డ్ కొట్టారు
జూన్ 2022లో గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ డాక్టర్ దుబాయ్‌కు ఫ్యామిలీ టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేస్తానని, బ్యాంక్ ఖాతా బదిలీలు, పేటీఎం బదిలీల ద్వారా మోసపూరితంగా రూ. 18.72 లక్షలు విశాల్ పాండే తీసుకున్నాడని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పశ్చిమ బెంగాల్‌లోని అతడిని ఇంట్లోనే పట్టుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ రీటా యాదవ్ తెలిపారు. పాండే అదే పద్ధతిని ఉపయోగించి వందలాది మంది వైద్యులను మోసగించాడని మరియు మోసపూరితంగా కోట్ల రూపాయలు సంపాదించాడని దర్యాప్తులో వెల్లడైంది. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో వైద్యులను మోసగించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అతనిపై ఐపీసీ సెక్షన్లు 419, 420, 467, 468, 471, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. .