Pak University Exam: అన్నాచెల్లెలు మధ్య సెక్స్ గురించి పాకిస్థాన్‌లోని ఓ యూనివర్సిటీ విద్యార్థులను వారి అభిప్రాయాలను అడిగిన నేపథ్యంలో సోషల్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. పలువురు ప్రముఖులు, విద్యార్థి సంఘాలు ఇస్లామాబాద్‌కు చెందిన సీఓఎంఎస్‌ఏటీఎస్ విశ్వవిద్యాలయం ప్రశ్నాపత్రంలోని ఈ అసభ్యకరమైన కంటెంట్‌ను నిందించారు. వైస్ ఛాన్సలర్, ఛాన్సలర్‌లను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం స్క్రీన్‌షాట్‌లు ట్విట్టర్‌తో సహా అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయి. ఇది జూలీ, మార్క్ అనే ఇద్దరు అన్నాచెల్లెలు మధ్య లైంగిక సంబంధం అని పెట్టి వ్యాసం రాసి.. దాని కింద కొన్ని ప్రశ్నలను విద్యార్థులకు ఇచ్చారు. ప్రశ్నాపత్రంలో విద్యార్థులు తమ సమాధానాలను రూపొందించడానికి కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చారు.
దీనిపై నటుడు, గాయకుడు మిషిఖాన్ ట్విట్టర్‌లో మండిపడ్డారు. ఈ ప్రశ్నలు అడిగినందుకు సిగ్గుపడాలని, యూనివర్సిటీకి సీలు వేయాలన్నారు. దిక్కుమాలిన ఉపాధ్యాయులను తరిమి కొట్టాలని, ఈ ప్రశ్న ఎవరు అడిగినా కటకటాల వెనుక ఉండాలన్నారు. ఈ నీచమైన ప్రశ్న అడగడానికి మీకు ఎంత ధైర్యం అని ఆయన ప్రశ్నించారు. “పాకిస్తాన్‌లోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు పాకిస్థాన్ యువతను, సంస్కృతిని, మతపరమైన విలువలను నాశనం చేసే లక్ష్యంతో ఉన్నాయని” షెహ్ర్యార్ బుఖారీ అన్నారు. వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ ప్రకారం గత ఏడాది డిసెంబర్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (బీఈఈ) విద్యార్థులకు ఈ వివాదాస్పద ప్రశ్న ఇచ్చారు.
Lanka Crisis: సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక.. ఎన్నికలు వాయిదా!
అసలు ప్రశ్న ఏమిటంటే.. “జూలీ, మార్క్ అన్నాచెల్లెల్లు. వారు కళాశాల నుండి వేసవి సెలవులకు ఫ్రాన్స్‌లో కలిసి ప్రయాణిస్తున్నారు. ఒక రాత్రి వారు బీచ్ సమీపంలోని క్యాబిన్‌లో ఒంటరిగా ఉన్నారు. వారు ప్రేమించుకోవడానికి ప్రయత్నిస్తే ఆసక్తికరంగా, సరదాగా ఉంటుందని వారు నిర్ణయించుకున్నారు. జూలీ జనన నియంత్రణలో ఉందని.. మార్క్ కండోమ్‌ను ఉపయోగించారు. వారిద్దరూ కలిసి సన్నిహితంగా ఉండటాన్ని ఆస్వాదించారు. అయితే వారు మళ్లీ అలా చేయకూడదని ప్రతిజ్ఞ చేశారు.” తదుపరి ప్రశ్నలలో మొత్తం దృశ్యం గురించి విద్యార్థులను వారి అభిప్రాయాలను అడిగారు. వారు ప్రేమించుకోవడం సరైనదా కాదా అని అడిగారు. వారు కారణాలను తెలియజేయమని, కొన్ని సంబంధిత ఉదాహరణలను చేర్చండి అని కూడా అడిగారు. ప్రశ్న ఇచ్చిన ఉపాధ్యాయుడిని ప్రొఫెసర్ ఖైర్ ఉల్ బషర్‌గా గుర్తించారు. విచారణ అనంతరం యూనివర్శిటీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించి బ్లాక్ లిస్టులో పెట్టింది. “క్విజ్‌లోని కంటెంట్ చాలా అభ్యంతరకరమైనది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ పాఠ్యప్రణాళిక చట్టాలకు పూర్తిగా విరుద్ధం. విద్యార్థుల కుటుంబాల మధ్య అశాంతిని కలిగించింది” అని ఒక విశ్వవిద్యాలయ అధికారి అన్నారు.