ఆడపిల్లలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా కామాంధులు తమ పశువాంఛను తీర్చుకుంటున్నారు. పాఠశాల ఆవరణలోనే 6వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆ సంస్థ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ సోమవారం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి)పై క్షిపణి దాడి చేస్తామని బెదిరించారు.
అదానీ సమస్యపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు డిమాండ్‌పై ప్రతిపక్షాల గందరగోళం మధ్య కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌కు చెందిన 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1.118 లక్షల కోట్ల బడ్జెట్‌ను లోక్‌సభ ఈరోజు ఆమోదించింది.
వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృత్‌పాల్ సింగ్ దేశం నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నందున సరిహద్దు భద్రతా దళం (BSF), సశాస్త్ర సీమా బల్ (SSB)కి కేంద్రం సందేశం పంపడంతో నేపాల్, పాకిస్తాన్‌తో సహా అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి.
విద్య, జీవనోపాధి అవకాశాల కోసం ఒక సమగ్ర వేదిక ఫ్రీడమ్ యాప్ ధరల నమూనాలో గణనీయమైన మార్పును ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను శక్తివంతం చేయడానికి ప్రస్తుతం ఉన్న కోర్సుల ధరలను తగ్గించినట్లు తెలుస్తోంది.
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి ఉత్తమ మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. తండ్రి స్థానంలో ఉండి విద్యార్థులను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన గురువు.. కళ్లు మూసుకుపోయి కన్న బిడ్డ లాంటి విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
అత్తారింటికి ప్రయాణమైన నవవధువు మార్గమధ్యంలో అనూహ్యం నిర్ణయం తీసుకుంది. పెళ్లైన ఏడు గంటలకే అత్తవారిల్లు దూరంగా ఉందంటూ అకస్మాత్తుగా ఏడుపు మొదలుపెట్టింది. అక్కడికి వెళ్లేందుకు ఆ వధువు నిరాకరించింది. కారులో బయల్దేరి వెళ్తుండగా మధ్యలోనే ఆగి.. తిరిగి పుట్టింటికి పయనమైంది.
బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బంగ్లాదేశ్‌లోని మదారిపూర్‌లోని శిబ్‌చార్ ఉపజిల్లాలోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో బస్సు కాలువలో పడిపోవడంతో 16 మంది మరణించగా.. 30 మంది గాయపడ్డారు.
ఢిల్లీలోని రాహుల్‌గాంధీ నివాసానికి ఆదివారం ఢిల్లీ పోలీసులు వెళ్లారు. ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన “మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారు” అనే వ్యాఖ్యకు సంబంధించి ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఈరోజు ఆయన నివాసానికి చేరుకున్నారు.