విశాఖ వేదికగా టీమిండియా ఆసీస్‌తో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే రెండో వన్డేలో ఆసీస్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మొదటి వన్డేలో అతికష్టం మీద విజయం సాధించిన టీమిండియా.. రెండో వన్డేలో రాణించాలని చూస్తోంది.
ప్రముఖ మెక్సికన్ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ మారియో మోలినా 80వ జన్మదిన వేడుకను గూగుల్ ఆదివారం నాడు కలర్‌ఫుల్ డూడుల్‌తో జరుపుకుంది. రసాయన శాస్త్రంలో 1995 నోబెల్ బహుమతి సహ-గ్రహీత, మారియో మోలినా ఓజోన్ పొరను రక్షించడానికి కలిసి రావాలని ప్రభుత్వాలను విజయవంతంగా ఒప్పించిన ఘనతను పొందారు.
దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలన్నీ విజయవంతంగా నడుస్తున్నాయని, వాటిని చూసి ఓర్వలేకే కొందరు ఆరోపణలు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఇండియా టుడే కాన్క్లేవ్ 2023లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం కీలకోపన్యాసం చేస్తూ.. భారత ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంస్థల విజయం కొందరిలో అసూయను కలిగిస్తోందని అన్నారు.
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున సచిన్ పైలట్‌తో విభేదాల చర్చలను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం తోసిపుచ్చారు. అయితే అన్నీ పార్టీల మాదిరాగానే కాంగ్రెస్‌లో చిన్న చిన్న విభేదాలు ఉంటాయని ఆయన అన్నారు.
తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి చీలిపోతూ వస్తోంది. రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలంతా ఏఐఏడీఎంకే పార్టీకి వరుస కడుతున్నారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య వివాదం ముదురుతోంది.
పెరూ, ఈక్వెడార్‌లను భారీ భూకంపం శనివారం వణికించింది. ఈ శక్తివంతమైన భూకంపంలో దాదాపు 12 మంది మృతి చెందగా.. ఒకరు గాయపడినట్లు సమాచారం. భవనాలు చాలా వరకు దెబ్బతిన్నాయని ఈక్వెడార్ ప్రెసిడెన్సీ తెలిపింది.
తోషాఖానా కేసు విచారణకు సంబంధించి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌లోని వాహనం ప్రమాదానికి గురైందని పాక్ మీడియా వెల్లడించింది.
పాకిస్తాన్‌లో దిగువ కోహిస్థాన్‌లోని పట్టాన్ ప్రాంతంలో ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక మహిళ, ఆమె అత్తగారు, ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు సహా ఒకే కుటుంబంలోని పది మంది సభ్యులు మరణించారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ఉదయం కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రార్థనలు చేశారు. గత ఆరేళ్లలో 100వ సారి ఆలయాన్ని సందర్శించిన ఉత్తరప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి అయ్యారని అధికారిక ప్రకటన తెలిపింది.