Bride Shocking Decision: అత్తారింటికి ప్రయాణమైన నవవధువు మార్గమధ్యంలో అనూహ్యం నిర్ణయం తీసుకుంది. పెళ్లైన ఏడు గంటలకే అత్తవారిల్లు దూరంగా ఉందంటూ అకస్మాత్తుగా ఏడుపు మొదలుపెట్టింది. అక్కడికి వెళ్లేందుకు ఆ వధువు నిరాకరించింది. కారులో బయల్దేరి వెళ్తుండగా మధ్యలోనే ఆగి.. తిరిగి పుట్టింటికి పయనమైంది. ఏడు అడుగులు వేసిన వ్యక్తిని ఏడు గంటల్లోనే వదులుకునేందుకు సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఆ యువతి పెళ్లి ఘనంగా జరిగింది. అప్పగింతలు అయిపోయాక వరుడితో పాటు అత్తవారింటికి బయలుదేరాక.. కొంతదూరం ప్రయాణించి అనంతరం మెట్టినిల్లు చాలా దూరంగా అనిపించింది. పుట్టింటి వారిని వదల్లేక ధైర్యంచేసి మధ్యలోని ఇంటికి రావాలని నిర్ణయం తీసుకుని అనుకున్నది సాధించింది. దీంతో వరుడి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.
Read Also: Visakhapatnam Crime: పోలీస్ స్టేషన్ కు చేరిన ఫేస్ బుక్ పరిచయం..! ఏం జరిగిందంటే?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతికి రాజస్థాన్‌కు చెందిన యువకుడితో ఇటీవలే వివాహం జరిగింది. అప్పగింతలు పూర్తయ్యాక వధువు మెట్టినింటికి కారులో బయలుదేరింది. మార్గమధ్యంలో యువతి అకస్మాత్తుగా తన మనసు మార్చుకుంది. ‘‘అత్తారిల్లు దూరంగా ఉంది.. నేను మా పుట్టింటికి వెళ్లిపోతా’’ అంటూ ఏడుపు లంఘించుకుంది. కారు ఆపాలని పట్టుపట్టింది. కారు ఆగంగానే కారు దిగిపోయింది. నడివీధిలో పెళ్లిదుస్తుల్లో ఓ యువతి పెద్ద పెట్టున ఏడవడంతో హైవేపై కలకలం రేగింది. అసలేం జరుగుతోందో తెలుసుకునేందుకు వాహనదారులు ఆగడంతో హైవేపై వాహనాలు బారులుతీరాయి.
ఇదంతా చూసి వరుడికి దిమ్మతిరిగినంత పనైంది. ఈ విషయం మహరాజ్‌పూర్ పోలీసులకు తెలియడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి తరపు వారిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను పుట్టింటికి తిరిగి వెళ్లిపోతానని వధువు తేల్చి చెప్పడంతో మహిళ పోలీసుల సాయంతో ఆమెను జాగ్రత్తగా పంపించారు. మరోవైపు, వరుడి తరఫు వారందరూ రాజస్థాన్‌కు చెందిన కుటుంబ సభ్యులని తెలుసుకుని.. వారిని కూడా రాజస్థాన్‌కు పంపారు.