గతవారం బ్రిటన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం దగ్గర ఖలిస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. భారత హైకమిషన్ కార్యాలయంపై ఉన్న భారత త్రివర్ణ పతాకాన్ని తొలగించారు. దీంతో మరో భారీ పతాకాన్ని అప్పటికప్పుడు తెచ్చి కమిషన్ కార్యాలయంపై ప్రదర్శించారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఓ ఉన్నత పాఠశాలపై రష్యా డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయపడినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. కీవ్‌లోని స్కూల్‌పై రష్యా రాత్రిపూట ఈ దాడి చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
తమిళనాడులోని కాంచీపురంలో ఇవాళ ఘోర పేలుడు సంభవించింది. కాంచీపురంలోని కురువిమలైలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనం అయ్యారు.
దేశంలో కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో పరిస్థితి, ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఎంతో అద్భుతమైనది. ఎన్ని కష్టాలొచ్చినా ఆ బంధం విడదీయలేనిది. కానీ కొన్నిసార్లు డబ్బు ఈ భావాలన్నింటినీ మారుస్తుంది. థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తికి ఇలాంటిదే జరిగింది.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన ఆఫీస్‌కు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయడం తీవ్ర కలకలం రేపింది. రూ.10 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి మూడు సార్లు కాల్స్ చేశాడు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై తీవ్ర దాడిని ప్రారంభించారు. ప్రకటనలపై అధిక వ్యయం కారణంగా ఢిల్లీ బడ్జెట్‌కు అంతకుముందు రోజు కేంద్రం ఆమోదం ఇవ్వలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బుధవారం బడ్జెట్ సమర్పణకు ఆమోదం తెలపడానికి ముందు ప్రకటనల ఖర్చుపై వివరణ ఇవ్వాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సిసోడియా తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.