Physical Harassment: ఆడపిల్లలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా కామాంధులు తమ పశువాంఛను తీర్చుకుంటున్నారు. పాఠశాల ఆవరణలోనే 6వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తరగతి గదిలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో చోటుచేసుకుంది. మైనర్ బాలిక స్నేహితురాలు ఈ విషయాన్ని మైనర్ తల్లికి తెలియజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
12 ఏళ్ల బాధిత బాలికతో పాటు నిందితులందరూ 19-22 సంవత్సరాల మధ్య వయస్సు గల వారే. వారు ఒకే గ్రామానికి చెందినవారు. ఆ మైనర్ బాలిక ఓ నిందితుడి సోదరికి స్నేహితురాలు కూడా. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం ముగ్గురిని అరెస్టు చేశామని గజోల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ పోలీసు అధికారి వెల్లడించారు. వారిని కోర్టులో హాజరుపరిచారమని, ఇప్పుడు పోలీసు కస్టడీలో ఉన్నారని ఆయన తెలిపారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Also: Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట.. దేశ సరిహద్దుల్లో అప్రమత్తం
అసలేం జరిగిందంటే.. శనివారం పాఠశాల మూసివేయబడింది. కానీ గ్రామంలోని కొందరు పిల్లలు ఆ విషయం తెలియర పాఠశాలకు వచ్చారు. వచ్చిన వారిలో కొందరు ఇళ్లకు తిరిగి వెళ్లగా.. మరికొంత మంది పిల్లలు అక్కడే ఉండిపోయారు. ఇద్దరు విద్యార్థినులు మొదటి అంతస్తులోని తరగతి గదిలో ఆడుకుంటున్నారు. ఆ సమయంలో పాఠశాలలోకి ముగ్గురు యువకులు వచ్చారు. ఆ బాలికలు ఆడుకుంటున్న మొదటి అంతస్తులోని తరగతి గదికి వెళ్లారు. అందులో ఓ బాలిక అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత నిందితులు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారందరూ ఒకరికొకరు తెలిసినవారే. మరికొందరు పిల్లలు గ్రౌండ్ ఫ్లోర్ గదుల్లో, స్కూల్ ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటున్నారని ఓ అధికారి తెలిపారు. మైనర్ బాలిక స్నేహితురాలు ఈ విషయాన్ని మైనర్ తల్లికి తెలియజేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలిక తన తల్లికి తన బాధను వివరించడంతో ఆమె శనివారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు యువకులను అరెస్టు చేశారు.