Cheetah Sasha: కిడ్నీ వ్యాధితో నమీబియన్ చిరుత సాషా మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cheetah Sasha: నమీబియా నుంచి భారత్‌కు తరలించిన ఎనిమిది చిరుతల్లో ఒకటి జనవరి నుంచి కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ సోమవారం మరణించింది. సాషా రోజువారీ పర్యవేక్షణ తనిఖీలో అలసట, బలహీనంగా ఉన్నట్లు కనిపించేందు. వైద్య పరీక్షల్లో చిరుత డీహైడ్రేషన్‌కు గురైందని, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయని తేలింది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోకి నమీబియా నుంచి వచ్చిన చిరుతల మొదటి బ్యాచ్‌లో సాషా ఒకటి. గత సంవత్సరం నమీబియా నుంచి ప్రతిష్టాత్మకమైన పునఃప్రవేశ కార్యక్రమంలో ప్రవేశపెట్టి ఐదు ఆడ చిరుతలలో ఇది ఒకటి. గతేడాది సెప్టెంబరు 17న ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ఐదేళ్ల వయసున్న రెండు ఆడ చిరుతలను కునోలో ప్రవేశపెట్టారు. ఆ రెండు పెద్ద చిరుతలలో సాషా కూడా ఉంది.
గత వారం, మధ్యప్రదేశ్‌లో ఎల్టన్, ఫ్రెడ్డీ అనే మరో రెండు చిరుతలను అడవిలోకి వదిలారు. దీంతో నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతల్లో నాలుగింటిని షియోపూర్ జిల్లాలోని పార్క్‌లోని అడవిలోకి వదిలారు. ఎనిమిది నమీబియా చిరుతల్లో ఐదు ఆడ, మూడు మగ కాగా.. భారతదేశంలోని జాతులను పునరుద్ధరించే లక్ష్యంతో తిరిగి కునో నేషనల్ పార్క్‌లోకి ప్రవేశపెట్టబడ్డాయి. ఇక్కడ అవి 70 సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి.
Also Read
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
Read Also: Madal Virupakshappa: అవినీతి కేసులో బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప అరెస్ట్
మరో డజను చిరుతలను ఏడు మగ, ఐదు ఆడ వాటిని ఈ సంవత్సరం ఫిబ్రవరి 18 న దక్షిణాఫ్రికా నుంచి కునో నేషనల్ పార్క్‌కు తీసుకువచ్చారు. కునో నేషనల్ పార్క్ ఇప్పుడు 20 చిరుతలకు నిలయంగా ఉంది. రాబోయే దశాబ్దంలో ఆసియా దేశానికి డజన్ల కొద్దీ ఆఫ్రికన్ చిరుతలను పరిచయం చేసేందుకు దక్షిణాఫ్రికా భారత్‌తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ప్రపంచంలోని మొట్టమొదటి ఇంటర్‌కాంటినెంటల్ ట్రాన్స్‌లోకేషన్ ప్రాజెక్ట్ దేశంలో పెద్ద చిరుతలను తిరిగి ప్రవేశపెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!