సీబీఐ-ఈడీ దాడులు అవినీతిపరులందరినీ ఒకే రాజకీయ పార్టీలోకి తీసుకొచ్చాయని, కేంద్రంలో బీజేపీ పాలన ముగియగానే దేశం అవినీతి రహితంగా మారుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఆరోపించారు.
పాకిస్తాన్‌కు భారత్‌లో బిగ్ షాక్ తగిలింది. పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతా భారత్‌లో నిలిపివేయబడింది. దీనికి గల పూర్తి కారణాలు తెలియకపోయినప్పటికి లీగల్ డిమాండ్ నేపథ్యంలోనే ఇలా చేసి ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో 30వ తేదీ గురువారం నుంచి పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన ట్విట్టర్ ఖాతాను భారత్‌లో బ్లాక్ చేసింది.
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ సోదరుడు సంచలన ఆరోపణలు చేశాడు. ఓ అధికారి తనను రెండు వారాల్లో చంపేస్తానని బెదిరించాడని ఆరోపించాడు. 2006 ఉమేష్ పాల్ అపహరణ కేసులో నిర్దోషులుగా విడుదలైన ఏడుగురిలో అష్రఫ్ అహ్మద్ ఒకరు.
పార్లమెంటు ఎంపీగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ నియాజకవర్గం సీటుకు ఖాళీ ఏర్పడింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తారా? అనే అంశం చర్చకు వచ్చింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకే విడతలో కర్ణాటక ఎన్నికలను జరపనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటుకు గురైన ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్‌కు భారీ ఊరట లభించింది. ఆయనపై విధించిన అనర్హతను లోక్‌సభ వెనక్కి తీసుకుంది. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. గత కొన్ని రోజుల నుంచి వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేసుల సంఖ్య కేవలం వందల్లోనే ఉండేది. కానీ ఇప్పు డు పరిస్థితి మారుతోంది.
రాహుల్‌గాంధీని అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని పార్లమెంటు హౌసింగ్ ప్యానల్ ఆదేశించడం.. గడువు పొడిగించాలని కూడా అడగకుండా ఖాళీ చేసేందుకు రాహుల్ సిద్ధపడిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటారు? అన్న చర్చ నడుస్తున్నది.
పార్లమెంటు ఎంపీగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ నియాజకవర్గం సీటుకు ఖాళీ ఏర్పడింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తారా? అయితే.. ఎప్పుడు..? అనే చర్చ తెరమీదకు వచ్చింది.