India To Host SCO Security Advisers Meeting Today: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న భారతదేశం బుధవారం దేశ రాజధానిలో జాతీయ భద్రతా సలహాదారులు (NSA), ఉన్నత అధికారుల సమావేశాన్ని నిర్వహించనుంది. ఈరోజు జరగనున్న ఎస్‌సీవో ఎన్‌ఎస్‌ఏ స్థాయి సమావేశానికి ముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. భారత్ ఆతిథ్యమిస్తున్న ఎస్‌సీవో జాతీయ భద్రతా సలహాదారు సమావేశంలో పాకిస్తాన్ కూడా పాల్గొనాలని నిర్ణయించుకుంది. పాల్గొనే విధానం ఇంకా ఖరారు కాలేదు. ఈ సమావేశంలో పాక్ ప్రతినిధులు కూడా పాల్గొంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తదుపరి ముఖ్యమైన ఎస్‌సీవో సమావేశం ఏప్రిల్ 27-29 మధ్య ఢిల్లీలో జరగనున్న రక్షణ మంత్రుల సమావేశం.తదుపరి ఎస్‌సీవో సమావేశం మే 4- 5 తేదీలలో గోవాలో జరిగే విదేశాంగ మంత్రుల సమావేశం. జులైలో జరిగి ఎస్‌సీవో సమ్మిట్‌లో జూలైలో SCO సమ్మిట్ సభ్య దేశాల అధినేతలు పాల్గొనే అవకాశం ఉంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) అనేది 2001లో స్థాపించబడిన ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. ఇది భారతదేశం, చైనా, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అనే ఎనిమిది సభ్య దేశాలను కలిగి ఉంది. భారతదేశం 9 జూన్, 2017న ఎస్‌సీవోలో పూర్తి సభ్యత్వం పొందింది. ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా దేశాలు పరిశీలక దేశాలుగా కొనసాగుతున్నాయి. అర్మేనియా, అజర్‌బైజాన్, కంబోడియా, నేపాల్, శ్రీలంక, టర్కీ దేశాలు చర్చల్లో భాగస్వామ్య హోదాను కగి ఉన్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) దాని సభ్య దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, సైనిక సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రెండు దశాబ్దాల క్రితం స్థాపించబడిన ఒక ప్రధాన ప్రాంతీయ శక్తి కేంద్రం.
Read Also: Mexico-US Border: మెక్సికో-యూఎస్ బోర్డర్ లో ఘోర అగ్ని ప్రమాదం.. 39 మంది శరణార్ధుల మృతి
ఎస్‌సీవోలోని ఎనిమిది సభ్య దేశాలు ప్రపంచ మొత్తం జనాభాలో 42 శాతం, ప్రపంచ జీడీపీలో 25 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. బుధవారం న్యూఢిల్లీలో జరిగే ఎస్‌సీవో సభ్యదేశాల భద్రతా మండలి కార్యదర్శుల వార్షిక సమావేశానికి రష్యన్ ఫెడరేషన్ యొక్క భద్రతా మండలి కార్యదర్శి నికోలాయ్ పట్రుషేవ్ హాజరవుతారని రష్యా భద్రతా మండలి ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశం ప్రస్తుతం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) అధ్యక్ష పదవిని కలిగి ఉన్నందున, దాని ఎస్‌సీవో అధ్యక్షతన జరిగే కార్యక్రమాలకు పాకిస్తాన్‌తో సహా అన్ని సభ్యదేశాలు హాజరు కావాలని ఆశిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఫిబ్రవరిలో విలేకరుల సమావేశంలో తెలిపారు.