విధి ఆ కుటుంబంపై పగబట్టింది. చదువులో అద్భుతంగా రాణిస్తున్న కూతురికి ఉన్నట్టుండి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. అప్పటిదాకా ఎంతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా కష్టాల్లో పడింది.
గత వారం నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతం దిగుతుండగా జారిపడిన భారత పర్వతారోహకుడు అనురాగ్ మాలూ సజీవంగా దొరికాడు. మౌంట్ అన్నపూర్ణ అధిరోహించిన అతను గత వారం మిస్సయ్యాడు.
తనదైన గాత్రం, స్టైల్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఏర్పరచుకున్న యంగ్ సెన్సేషన్, సౌత్ కొరియన్ పాప్ సింగర్ మూన్‌బిన్(25) కన్నుమూశారు. చాలా చిన్న వయసులోనే కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ యువగాయకుడు బుధవారం తన అపార్ట్‌మెంట్‌లోని బెడ్‌రూంలో విగతజీవిగా పడి ఉన్నాడు.
సూరత్ కోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్ష తీర్పుపై స్టే ఇవ్వాలని రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టేసింది.
ఐపీఎల్-16లో గురువారం మరో ఆసక్తికర పోరు జరగనుంది. గురువారం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పంజాబ్ హోమ్ గ్రౌండ్ మొహాలీలో జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయపథంలోకి రావాలని కోరుకుంటోంది.
ఐపీఎల్-16లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు అన్ని జట్లు కనీసం రెండు విజయాలు సాధించగా.. వార్నర్ సేన ఇప్పటివరకు బోణీ కూడా కొట్టలేదు.
గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ల హత్య జరిగిన సంగతి తెలిసిందే. వారిద్దరిని చంపేందుకు హంతకులు ఒకరోజు ముందే ప్రయత్నించినట్లు తెలుస్తోంది. విచారణ కోసం ప్రయాగ్‌రాజ్ కోర్టుకు ఇద్దరినీ తీసుకెళ్లిన రోజునే షూటర్లు అతిఖ్, అష్రఫ్‌లను హత్య చేసేందుకు ప్రయత్నించారని సమాచారం
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. భారతదేశంలో గత 24 గంటల్లో 12,591 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువగా నమోదయ్యాయి.
ప్రస్తుత కాలంలో కొందరు వివాహితులు తాత్కాలిక శారీరక సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారితో పాటు కన్నవారిని కడతేర్చడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా ఓ వ్యక్తి తన రెండేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసి.. సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో మృతదేహాన్ని వాగులో పడేశాడు.
పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన పిటిషన్‌పై సూరత్ కోర్టు నేడు తన తీర్పును ప్రకటించనుంది.