Moon Bin: తనదైన గాత్రం, స్టైల్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఏర్పరచుకున్న యంగ్ సెన్సేషన్, సౌత్ కొరియన్ పాప్ సింగర్ మూన్‌బిన్(25) కన్నుమూశారు. చాలా చిన్న వయసులోనే కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ యువగాయకుడు బుధవారం తన అపార్ట్‌మెంట్‌లోని బెడ్‌రూంలో విగతజీవిగా పడి ఉన్నాడు. ఈ విషయాన్ని మూన్‌బిన్ సాంగ్స్‌ను రికార్డింగ్ చేసే కంపెనీ ‘ఫాంటియాగో’ ఒక ప్రకటనలో అధికారికంగా ధృవీకరించింది. పాప్ సింగ్ మూన్ బిన్ బుధవారం రాత్రి సియోల్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో అపస్మారక స్థితిలో ఉన్నట్లు ఆయన మేనేజర్ గుర్తించి.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు పార్థివ దేహాన్ని స్వాధీనం చేసుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం కోసం మూన్‌బిన్ భౌతిక కాయాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Read Also: Acid Attack: ఘోరం.. పెళ్లి మండపంలోనే వధువరులపై యాసిడ్ దాడి
మూన్‌బిన్ మరణంపై ‘ఫాంటియాగో’ కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో ‘మూన్‌బిన్ హఠాత్తుగా మనల్ని వదిలివెళ్లిపోయారు. వినీలాకాశంలో ధృవతారలా మారిపోయారు’ అంటూ పేర్కొంది. దీంతో అతడి అభిమానులు, సన్నిహితులు దుఖ: సాగరంలో మునిగిపోయారు. మూన్‌బిన్ ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా అతడి కోట్ల మంది ఫాలోవర్లు పోస్టులు చేస్తున్నారు. అనతి కాలంలోనే గొప్ప పేరు సాధించిన మూన్ బిన్ దక్షిణ కొరియాలోని చియోంగ్జులో జనవరి 26, 1998న జన్మించాడు. అతడు చిన్న వయసు నుంచే పాటలు, నటన, డ్యాన్స్‌లో రాణిస్తూ అంచలంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలోనే మరో ఐదుగురు గాయకులతో కలిసి ఫిబ్రవరి 23, 2016న K-పాప్ గ్రూప్ ASTROతో ప్రయాణాన్ని మొదలు పెట్టాడు.