జమ్మూకశ్మీర్‌లో కథువా జిల్లాలోని తన పాఠశాలలో ప్రాథమిక సౌకర్యాలు ఉండేలా చూడాలని 3వ తరగతి విద్యార్థిని వీడియో సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీని కోరిన కొన్ని రోజుల తర్వాత.. జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ దానికి కొత్త రూపాన్ని ఇచ్చే పనిని ప్రారంభించింది.
బుధవారం అర్థరాత్రి యెమెన్ రాజధాని సనాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అరేబియా ద్వీపకల్పంలోని అత్యంత పేద దేశమైన యెమెన్‌లో ఆర్థిక సహాయం పంపణీ చేసే కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 85 మందికిపైగా మరణించారు. వందల మంది గాయపడ్డారు.
ఒక కాన్పులో ఒకరు లేదా ఇద్దరు శిశువులు జన్మించడం సహజం. అరుదుగా మనం ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు పిల్లలు జన్మించిన సందర్భాలు చూస్తుంటాం. అలాంటి సంఘటనే ఇది. ఓ గర్భిణీ ఏకంగా నలుగురు శిశువులకు ఒకేసారి జన్మనిచ్చింది.
ఆవును హిందూ మతంలో మాతగా పరిగణిస్తారు. పవిత్రమైన విలువను కలిగి ఉంది. దీనిపై మరింత అవగాహన కల్పించేందుకు ఉత్తరత్త ప్రదేశ్‌లోని లక్నోలో ఓ ఆవు చేత రెస్టారెంట్‌ను ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. పవిత్ర జంతువు అయిన గోమాత వస్త్రాలతో అలంకరించబడి, పసుపు వస్త్రంతో కప్పబడి, సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని అందించే 'ఆర్గానిక్ ఒయాసిస్' అనే రెస్టారెంట్‌ను ప్రారంభించింది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. కొరియా దేశానికి చెందిన బ్లాగర్‌ను ఓ యువకుడు వేధించాడు. ఒంటరిగా కనిపించిన ఆ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కొరియన్ యువతిని ఫాలో అయ్యి రెచ్చిపోయాడు. కొరియన్ బ్లాగర్ తన కెమెరాలో అక్కడి ప్రదేశాలను చిత్రీకరిస్తుండగా.. ఆ యువకుడు తన దుస్తులు విప్పి, వికృతంగా నవ్వుతూ ప్రైవేట్ పార్ట్స్ బయటకు తీసి చూపించాడు. ఆ యువకుడి వెకిలి చేష్టలతో ఆ యువతి భయపడిపోయింది.
భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణమే. కానీ మద్యం సేవించడం వల్ల ఈ గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయంటే నమ్మక తప్పదు. ఆల్కహాల్ సేవనం తర్వాత ఇంటికొచ్చి కుటుంబీకులతో గొడవ పడిన ఘటనల గురించి వార్తల్లో చూస్తునే ఉన్నాం.
తనతో శృంగారంలో పాల్గొనమని బలవంతం చేసి ఓ వ్యక్తిని ఓ బాలుడు హత్యచేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తిని హతమార్చినందుకు 16 ఏళ్ల బాలుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్‌లో రోబో సాయంతో మొదటిసారిగా మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆ మేరకు కేర్ హాస్పిటల్ ఓ ప్రకటనలో తెలియజేసింది.