గురువారం జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో ఐదుగురు సైనికులను చంపిన ఉగ్రదాడి 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర కావచ్చునని ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర పేర్కొన్నారు.
గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నేత అతీఖ్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్‌ను గతవారం పోలీసుల కస్టడీలోనే మీడియా ముందు దారుణంగా తుపాకులతో కాల్చి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కొత్త ప్రశ్నలను లేవనెత్తారు.
లెగసీ బ్లూ టిక్‌లను తొలగించాలని ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయంతో హ్యాష్‌ట్యాగ్‌ల సృష్టికర్త క్రిస్ మెస్సినా ట్విట్టర్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే, తన బ్లూ టిక్‌ను రద్దు చేసినందున ట్విట్టర్‌ను విడిచిపెట్టాలనే నిర్ణయం తీసుకోలేదని, మొత్తం వెరిఫికేషన్ పరిస్థితిని నిర్వహించే విధానం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెస్సినా స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని, కొవిడ్ కేసులపై నిఘా ఉంచాలని కేంద్రం 8 రాష్ట్రాలను కోరింది. డైలీ పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో గమనించాలని కేంద్రం కోరింది.
యూకేలో ఓ వ్యక్తి నిద్రిస్తుండగా పెంపుడు కుక్క యజమానిపై దాడి చేసింది. యజమాని బొటనవేలును ఆ కుక్క నమిలేసింది. అదే అతనికి వరంలా మారింది. అతని ప్రాణాలను కాపాడినట్లు అయింది.
పంజాబ్ తరన్ తరణ్‌లోని గురుద్వారా శ్రీ దర్బార్ సాహిబ్ పార్కింగ్ స్థలంలో ఓ బాంబు కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీస్‌స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాంబును బయటకు తీశారు.
బ్రిటన్‌లో అధికారం చేపట్టిన భారత సంతతికి చెందిన రిషి సునాక్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయ శాఖా మంత్రి డొమినిక్ రాబ్ తన పదవికి రాజీనామా చేశారు. సొంత మంత్రిత్వ శాఖలోని సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దేశ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ తన పదవికి రాజీనామా చేశారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని బీఆర్‌ఎస్ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు ఢిల్లీలో ఉన్నోళ్లకు గులాంగిరి చేస్తారని, బీజేపీ వాళ్లు గుజరాత్ పెద్దలకు గులాంగిరి చేస్తారని.. కానీ బీఆర్‌ఎస్ వాళ్లు తెలంగాణ ప్రజలకు గులాం గిరి చేస్తారని మంత్రి అన్నారు.
శ్రీనగర్‌లోని ప్రఖ్యాత తులిప్ గార్డెన్ పర్యాటకుల సంఖ్యలో కొత్త రికార్డును నెలకొల్పింది. శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఖ్యాతి అర్జెంటీనా వంటి సుదూర దేశాలకు చేరుకుంది.
ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు అమృతపాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్ గురువారం లండన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్‌సర్ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.