Rahul Gandhi: సూరత్ కోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్ష తీర్పుపై స్టే ఇవ్వాలని రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. కాగా మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష వేయగా.. ఎంపీగా పార్లమెంట్ అనర్హత వేటు వేసింది. ఈ క్రమంలో సూరత్ సెషన్స్ కోర్టులో ఊరట లభిస్తుందని రాహుల్ భావించగా.. అక్కడా నిరాశే ఎదురైంది. మరి రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Read Also: Bharat Ratna: అతిక్ అహ్మద్‌కు భారతరత్న ఇవ్వాలి : కాంగ్రెస్ అభ్యర్థి
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ప్రచార కార్యక్రమంలో రాహుల్ గాంధీ ‘మోదీ’ అనే ఇంటిపేరును ఉపయోగించి చేసిన వ్యాఖ్యకు సంబంధించినది ఈ కేసు. 2019 ఏప్రిల్‌లో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రాహుల్, “దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది?” అని అన్నారు. 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాహుల్‌ని దోషిగా నిర్ధారించిన తర్వాత, రాహుల్‌ని మార్చి 24న ఎంపీగా అనర్హులుగా ప్రకటించారు. ఈ రూలింగ్ ప్రకారం, ఏ ఎంపీ లేదా ఎమ్మెల్యే అయినా దోషిగా నిర్ధారించబడి రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడితే ఆటోమేటిక్‌గా అనర్హులు అవుతారు.