సీపీఐ ప్రజా పోరు యాత్రలో భాగంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మంచిర్యాల తాండూరు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వ్యతిరేక ఐక్యతను సాధించడంలో కేసీఆర్ ఫెయిల్ అవుతున్నాడన్నారు. కేంద్రంతో కేసీఆర్ పోరాటం మంచిదే కానీ ముందుగా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు.
సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఇంటర్నేషనల్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేసి పట్టా తీసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ డే వేడుకకు హిమాన్షు తాత, నాయనమ్మలైన సీఎం కేసీఆర్, శోభ దంపతులు.. తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 60 వేలు దాటింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.
ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో మరో అడుగు పడింది. జనగామ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది.
నిర్మల్ పట్టణ శివారులో రూ.5.35 కోట్లతో నూతనంగా నిర్మించిన ఈద్గాను ప్రారంభించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
నారాయణపేట జిల్లా బోయిన్ పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ముగ్గు చిన్నారులు సహా ఓ మహిళ మృతి చెందారు. చెరువులో మునిగిపోతున్న పిల్లలను కాపాడే ప్రయత్నంలో తల్లి సురేఖ కూడా ప్రాణాలు కోల్పోయింది.
చోరీకి గురైనా లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ల జాడను తెలుసుకునేందుకు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) అనే విధానాన్ని కొత్తగా ప్రవేశ పెడుతున్నట్టు డీజీపీ అంజనీ కుమార్ ప్రకటించారు.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శిల్పం వర్ణం కృష్ణం సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ ఆఫ్ రామప్ప పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మిరుమిట్లు గొలిపే రంగురంగుల లేజర్ షోతో రామప్ప వెలిగిపోతోంది.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం అందరికి తెలిసిందే. ప్రపంచ దేశాలు కరోనా పేరు వింటేనే వణికిపోయాయి. ఆరోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసిన కరోనా గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టింది.