Srinagar Tulip Garden: శ్రీనగర్‌లోని ప్రఖ్యాత తులిప్ గార్డెన్ పర్యాటకుల సంఖ్యలో కొత్త రికార్డును నెలకొల్పింది. శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఖ్యాతి అర్జెంటీనా వంటి సుదూర దేశాలకు చేరుకుంది. ఈ సీజన్‌లో విదేశీయులతో సహా 3.7 లక్షల మంది పర్యాటకులు దీనిని సందర్శించారు. గతంలో సిరాజ్ బాగ్ అని పిలవబడే ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్ దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించిందని గార్డెన్ ఇన్‌ఛార్జ్ ఇనామ్-ఉర్ రెహ్మాన్ తెలిపారు.
తులిప్ షో 32వ రోజుకు చేరగా.. ఇప్పటి వరకు 3.7 లక్షల మందికి పైగా పర్యాటకులు తులిప్ గార్డెన్‌ను సందర్శించారు. వీరిలో మూడు లక్షల మందికి పైగా స్వదేశీ పర్యాటకులు ఉన్నారు. వారిలో 3,000 మందికి పైగా విదేశీ పర్యాటకుల గార్డెన్‌ను సందర్శించారని, విదేశీయుల నుంచి కూడా స్పందన బాగుందని ఆయన వెల్లడించారు. ఈ సీజన్‌లో అత్యధికంగా పర్యాటకులు తరలిరావడంతో తులిప్ షో విజయవంతమైందన్నారు. గతేడాది 3.6 లక్షల మంది పర్యాటకులు గార్డెన్‌ను సందర్శించారు.
Read Also: Kidney Stones : కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే.. ఇవి పాటించండి
“గ్లోబల్ అప్పీల్‌ని సృష్టించడం మా లక్ష్యం. మేము అందులో విజయం సాధించాము. థాయిలాండ్, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ దేశాలు, అర్జెంటీనా నుంచి పర్యాటకులు గార్డెన్‌ని సందర్శించారు.” అని రెహ్మాన్ చెప్పారు. కాశ్మీర్‌లో టూరిజం సీజన్‌ను పురోగమింపజేయడంలో తులిప్ గార్డెన్ గణనీయమైన పాత్ర పోషించిందని ఆయన అన్నారు. తులిప్‌లు పుష్పించే చివరి దశలో ఉన్నందున, గణనీయమైన సంఖ్యలో పర్యాటకులు ఇప్పటికీ తోటను సందర్శిస్తున్నారు. “థాయిలాండ్‌లో మాకు ఈ రకమైన తోట లేదు. ఇది చాలా బాగుంది. ఇక్కడ వివిధ రంగుల తులిప్‌లు చాలా ఉన్నాయి. నా స్నేహితుడితో పాటు నేను కూడా వీటిని ఇష్టపడతాము” అని థాయ్‌లాండ్‌కు చెందిన న్గోయెనోయ్ చెప్పారు. ఇది (కాశ్మీర్) భారతదేశానికి స్వర్గం. ఎక్కడ చూసినా పర్వతాలు, మధ్యలో వివిధ రంగుల తులిప్‌లు ఉన్నాయని పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.