Pet Dog Chewed Toe, But It Saved his Life: యూకేలో ఓ వ్యక్తి నిద్రిస్తుండగా పెంపుడు కుక్క యజమానిపై దాడి చేసింది. యజమాని బొటనవేలును ఆ కుక్క నమిలేసింది. అదే అతనికి వరంలా మారింది. అతని ప్రాణాలను కాపాడినట్లు అయింది. అసలేం.. జరిగిందంటే యూకేకు చెందిన డేవిడ్ లిండ్సే తన పిట్‌బుల్ డాగ్ హార్లేతో కలిసి సోఫాలో నిద్రిస్తున్నాడు. అప్పుడు అతడి పెంపు కుక్క ఏడు నెలల బుల్‌డాగ్ అతడి కాలి బొటన వేలుని కొరికేసింది. అయితే కుక్క కాలి బొటనవేలును నమిలివేస్తుండగా.. అతడి భార్య గట్టిగా అరవడంతో అతడు నిద్ర లేచాడు. ఇదంతా గమనించని యజమాని సడెన్‌గా లేచి చూసేటప్పటికీ.. కాలి దగ్గర ఏం చేస్తుందా? అంటూ చూసి షాక్ అవుతాడు. కుక్క బొటన వేలిని కొరకడంతో విరిగిపోవడంతో పాటు ఒక గోరు వేలాడుతూ కనిపించింది. కుక్క ఏమి చేసిందో తెలుసుకుని దంపతులు ఆశ్చర్యపోయినప్పటికీ, అది అతడికి వరంగా మారింది.
Read Also: Bomb found: గురుద్వారాలో బాంబు లభ్యం.. ఉగ్రకుట్ర ఉందా?
ఇందులో విచిత్రమేమిటంటే ఎముక బయటకు వచ్చేలా గాయం చేసినా అతడికి నొప్పి తెలియలేదు. దీంతో అతను వెంటనే ఆస్పత్రికి వెళ్లి జాయిన్ అవ్వగా అసలు విషయం తెలిసి కంగుతింటాడు. తనకు డయాబెటీస్ వచ్చిందని, శరీరంలో రెండు దమనులు మూసుకుపోవడం వల్ల కాళ్లకు రక్తం సరిగా సరఫరా కావడం లేదని డాక్టర్లు చెప్పారు. రక్తం సరిగా సరఫరా కాకపోవడం వల్లే తనకు స్పర్శ తెలియలేదని వైద్యులు వెల్లడించారు. కుక్క అలా దాడి చేయడం వల్లే కదా డాక్టర్లు ఈ విషయం చెప్పగలిగారని లిండ్సే పేర్కొన్నాడు. అది గాయం చేయడం తనకు మంచిదే అయ్యిందని, అందువల్ల ఆ కుక్కను బయటకు పంపిచే ఆలోచన కూడా తనకు లేదని లిండ్సే చెప్పాడు. అతని ఎముకకు ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా ఆపడానికి వైద్యులు ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ ఇవ్వడంతో తొమ్మిది రోజులు ఆసుపత్రిలో గడపవలసి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. కానీ డాక్టర్లు ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉన్నందున్న లిండ్సే బొటనవేలుని తీసేశారు.