Rishi Sunak: బ్రిటన్‌లో అధికారం చేపట్టిన భారత సంతతికి చెందిన రిషి సునాక్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయ శాఖా మంత్రి డొమినిక్ రాబ్ తన పదవికి రాజీనామా చేశారు. సొంత మంత్రిత్వ శాఖలోని సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దేశ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ బెదిరింపు ఆరోపణలపై దర్యాప్తు కమిటీ నివేదిక ప్రధాని రిషి సునాక్‌కు అందిన కొన్ని గంటల్లోనే డొమినిక్ రాబ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని రిషి సునాక్‌కు రాసిన రాజీనామా లేఖను ట్విటర్‌లో డొమినిక్ రాబ్ పోస్ట్ చేశారు.
Read Also: Godhra Case: సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు.. 8 మంది దోషులకు బెయిల్
అక్టోబరులో రిషి సునక్ బ్రిటిష్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వ్యక్తిగత ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలతో సునాక్ కేబినెట్‌లో రాజీనామా చేసిన వ్యక్తుల్లో డొమినిక్ రాబ్ మూడో వ్యక్తి కావడం గమనార్హం. డొమినిక్ రాబ్‌పై బెదిరింపు ఆరోపణలపై వచ్చిన రెండు ఫిర్యాదులను పరిశీలించడానికి సీనియర్ ఉద్యోగ న్యాయవాది ఆడమ్ టోలీని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నియమించారు. డొమినిక్ రాబ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకునే అవకాశం ఉండగా, ఆలోపే రాబ్ రాజీనామా చేశారు. టోలీ తన నివేదికను రిషి సునాక్‌కు గురువారం ఉదయం పంపినట్లు ప్రధాన మంత్రి ప్రతినిధి ధృవీకరించారు.