ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవరం ఇంటర్ ఫస్ట్ ఇయర్‌తో పాటు సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు.
విశాఖ తీరంలో కిడ్నీ రాకెట్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్లను టార్గెట్ చేసిన గ్యాంగ్.. డబ్బు ఆశచూపి అమాయకుల కిడ్నీ తీసుకుని మోసం చేస్తోంది. బాధితుడి ఫిర్యాదుతో ఈ గ్యాంగ్ అరాచకాలు బయటపడ్డాయి.
ఏపీలో అవినీతి అధికారులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. సబ్ రిజిస్టర్ , ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేసింది. పలువురు అవినీతి అధికారులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. పలు డాక్యుమెంట్లు , లక్షల్లో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాల్లో బుధవారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గుంటూరులో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాశాంతి పార్టీ గుంటూరు జిల్లా కమిటీ ఏర్పాటు చేశామని.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది ఆన్‌లైన్‌లో ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని కేఏ పాల్ ఆరోపించారు.
పాఠ్య పుస్తకాల విషయంలో కొత్త విధానానికి ఏపీ విద్యా శాఖ బీజం వేసింది. 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చే విధానాన్ని ఏపీ విద్యాశాఖ తీసుకొస్తోంది.
ఏపీ ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కృష్ణా జిల్లా సత్తా చాటింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా కృష్ణా నిలిచింది.