ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు ఫోన్‌లో పేర్కొన్నందుకు 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశామని, ఆ కాల్ బూటకమని తేలిందని పోలీసులు గురువారం తెలిపారు.
శ్చిమ బెంగాల్‌లోని ఐదు జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ప్రకృతి ప్రకోపానికి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొరోజులో డజనుకుపైగా మంది బలయ్యారు. రాష్ట్రంలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుల కారణంగా కనీసం 14 మంది మరణించారని అధికారులు తెలిపారు.
సీఎం కాన్వాయ్‌ను రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయడం పక్కా ప్లాన్‌తో జరిగిందని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. తుంపర్తి, మోటమర్ల వద్ద భూసేకరణ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని.. అప్పట్లో ఎకరాకు 5 లక్షల పరిహారంగా నిర్ణయించి ఆ డబ్బు కోర్టులో డిపాజిట్ చేశారన్నారు.
టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. చంద్రబాబు సత్తెనపల్లి సభ అట్టర్‌ఫ్లాప్ అయిందని కామెంట్స్ చేశారు. కానీ ప్రచారం మాత్రం ఆర్భాటంగా చెప్పుకున్నారన్నారు. సత్తెనపల్లి సభకు జనం రాకపోయినా అద్భుతం అనడం చంద్రబాబు ఖర్మ అంటూ విమర్శలు గుప్పించారు.
వివేకా చనిపోయిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆరోజు ఎం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. ఆ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలను అవినాష్ రెడ్డి చెప్పారు.
భగీరథ మహర్షి జయంతి సందర్బంగా క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా భగీరథ మహర్షి చిత్రపటానికి ముఖ్యమంత్రి జగన్ నివాళులు అర్పించారు
వైఎస్ వివేకా కేసులో ఏ1 నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు గురువారం రద్దు చేసింది. వచ్చే నెల 5లోగో హైదరాబాద్ సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని ఎర్ర గంగరెడ్డిని ఆదేశించింది. ఒకవేళ గంగిరెడ్డి లొంగిపోకపోతే అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి తెలంగాణ హైకోర్టు సూచించింది.
గుడ్డు తిని చిన్నారి మృతి చెందడంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. గత ఏడాది కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్డు తిని చిన్నారి మృతి చెందింది.
అల్లూరి జిల్లా పాడేరు సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డుపై వెళుతుండగా ఒక్కసారిగా కారు అదుపతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో భార్యాభర్తలతో సహా ముగ్గురు మృత్యువాత పడ్డారు.