ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు మరికొన్ని నగరాలపై రష్యా తెల్లవారుజామునే దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఉక్రేనియన్ దళాలు త్వరలో దాని పాశ్చాత్య మిత్రదేశాల నుంచి వచ్చిన ట్యాంకులతో సహా కొత్త సైనిక పరికరాలతో దాడిని ప్రారంభించాలని భావిస్తున్నందున రష్యా ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
తన కుమార్తె అక్షతామూర్తి తన భర్తను ప్రధాన మంత్రిని చేసిందని యూకే ప్రధాని రిషి సునాక్ అత్త సుధామూర్తి అన్నారు. రిషి సునాక్ త్వరగా అధికారంలోకి వచ్చారని.. అయితే అది తన కూతురి వల్లే సాధ్యమైందని సుధామూర్తి పేర్కొన్నారు.
బీహార్‌కు చెందిన జేడీయూ సీనియర్ నేత కైలాష్ మహతో దారుణంగా హత్యకు గురయ్యారు. ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు గురువారం కతిహార్‌లో గుర్తుతెలియని బైక్‌పై వచ్చిన దుండగులు కాల్చి చంపారు.
భారత బాక్సింగ్ దిగ్గజం, 1982 ఆసియా క్రీడల బాక్సింగ్ ఛాంపియన్ కౌర్ సింగ్(74) తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న కౌర్ సింగ్.. గురువారం హర్యానాలోని కురుక్షేత్ర ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు.
శుక్రవారం తెల్లవారుజామున నేపాల్‌లో రెండు గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు సంభవించాయి. ఒకటి మోస్తరుగా, మరొకటి తేలికపాటి తీవ్రతతో సంభవించినట్లు తెలుస్తోంది.
మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలో ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ పర్యటనకు ముందు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడడాన్ని ఆ రాష్ట్ర సర్కారు నిషేధించింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
గతేడాది భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించబోతున్న సందర్భంలో రాహుల్ గాంధీకి ఓ బెదిరింపులు వచ్చాయి. ఆయన ఇండోర్‌లోకి ప్రవేశించిన వెంటనే ఆయనపై బాంబ్ వేస్తానని బెదిరిస్తూ రాసిన లేఖ అదే నగరంలోని ఓ స్వీట్ షాప్ ఎదురుగా లభించింది.
అమెరికాలోని అలస్కాలో యూఎస్ మిలిటరీకి చెందిన రెండు హెలికాప్టర్లు కూలిపోయాయి. మిలటరీ శిక్షణలో భాగంగా రెండు ఆర్మీ హెలికాప్టర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. శిక్షణ విమానాలు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మూడు దశాబ్దాల క్రితం ఐఏఎస్ అధికారిని హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవించిన గ్యాంగ్‌స్టర్, రాజకీయవేత్త ఆనంద్ మోహన్ విడుదలను సులభతరం చేసిన బీహార్ జైలు నిబంధనల సవరణను సవాలు చేస్తూ పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.