Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవరం ఇంటర్ ఫస్ట్ ఇయర్‌తో పాటు సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్ బోర్డుకు తెలియజేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Read Also: Battery vehicles: కొత్త సచివాలయంలో బ్యాటరీ వాహనాలు సందడి.. వారి కోసమా?
మే 24 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. రెండు సెషన్స్‌లో సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు త్వరలో విడుదల చేస్తుందని తెలిపారు. ఇందుకుగాను గురువారం నుంచి మే నెల 3వ తేదీ వరకు ఫీజు చెల్లించుకునే వెసులుబాటును కల్పించారు. అదే విధంగా జూన్ 5 నుంచి జూన్ 9 వరకు సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.