Minister Merugu Nagarjuna: చంద్రబాబు అవసరమైతే కాళ్లు పట్టుకుంటారని.. లేకపోతే తరిమేస్తారని మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. ఎస్సీలకు ఎవరేం చేశారో చర్చకు రమ్మని చంద్రబాబు సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సవాల్‌కు తాను సిద్ధమేనని.. ఎక్కడికో రావాలో చెప్పాలన్నారు. నీ హయాంలో దళితుల మీద దాడులు, ఆస్తులు కబ్జా దగ్గర నుండి అన్నింటిపై చర్చిద్దామన్నారు. అసలు దళితులకు నువ్వు ఏం చేశావయ్యా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. జగన్ పల్లెల్లో మార్పులు తెచ్చారు, స్కూల్స్ మార్చారు, పిల్లలకు ఇంగ్లీషు మీడియం నేర్పారు, ట్యాబ్‌లలో చూసి చదువుకునే స్థాయికి తెచ్చారు, ఆరోగ్యశ్రీతో ఆరోగ్య భద్రత తెచ్చారు.. కానీ మీ హయాంలో ఏం చేశారని ప్రశ్నించారు.
Read Also: KA Paul: పవన్ కల్యాణ్ డ్యాన్స్ వేస్తే రాష్ట్రంలో అప్పులు తీరుతాయా..
అంబేద్కర్ విగ్రహం పెట్టలేక చంద్రబాబు పారిపోయారని.. జగన్ విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్నారన్నారు. పేదలకు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని.. పదవుల్లో జగన్ మాకు అగ్రతాంబూలం ఇచ్చారని.. వీటిల్లో దీనిపైనైనా చర్చకు సిద్ధమేనని మంత్రి అన్నారు. ఓడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని సవాల్ విసిరారు. వైఎస్ఆర్ సమాధి దగ్గరే ఉండిపోతానన్నారు. మరి మీరు చర్చకు రాగలరా చంద్రబాబు అంటు ప్రశ్నించారు. దళితులకు రాజకీయాలు ఎందుకని టీడీపీ నాయకుడు చింతమనేని అన్నాడని మంత్రి చెప్పారు. విదేశీ విద్య విషయంలో చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. చర్చకు చంద్రబాబే రావాలి.. మరొకరు వస్తానంటే కుదరదన్నారు. జగన్‌పై ప్రజలకున్న ప్రేమను చూసి చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదన్నారు. వైసీపీ అంటిస్తున్న స్టిక్కర్లను చూసి భయపడుతున్నారని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.