వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటీషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని షరతులను ఈ సందర్బంగా కోర్టు సూచించింది. రూ.30 వేలు, ఇద్దరు పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఇక షర్మిల విదేశాలకు వెళ్లాలనుకుంటే కోర్టు అనుమతి తప్పనిసరని తెలిపింది.
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యారు. తీర్పును లంచ్ తర్వాత కోర్టు ఇవ్వనుంది. పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో ఆమెను సోమవారం అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
వెటరన్ బ్యాటర్ అజింక్య రహానె జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి) ఫైనల్‌కు భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం భారత జట్టును ఇవాళ (ఏప్రిల్ 25) ప్రకటించారు.
రాయల తెలంగాణ అంశంపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాకారమని.. రాయల తెలంగాణ అంశం వదిలి ఆ దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచించాలని కోరారు.
మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన ముష్కి మహేష్ అదే గ్రామానికి చెందిన నలుగురు నడిరోడ్డుపై బండరాయితో కిరాతకంగా కొట్టి చంపేశారు.
మెదక్ జిల్లా శివంపేట మండలం కొత్తపేట గ్రామంలో భూవివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కారంపొడి, కొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో రెండు వర్గాలు దాడి చేసుకున్నాయి.
ఐపీఎల్-16వ సీజన్‌లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మ్యాచ్ జరగనుంది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి పంజాబ్‌పై పోరాడి ఓడిన రోహిత్ సేన గుజరాత్‌పై తప్పనిసరిగా గెలవాలనే కసితో ఉంది.