Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
- గాజా స్వాధీనం చేసుకోండి..
- నెతన్యాహూ సంచలన ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaza War: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సంచలన ప్రకటన చేశారు. గాజా స్ట్రిప్‌లోని 70 శాతం భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకోవాలని ఇజ్రాయిల్ సైన్యాన్ని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. గాజాలోని అధిక భూభాగం సైనిక నియంత్రణలోకి తీసుకునే ప్లాన్‌ను నెతన్యాహూ ప్రకటించారు. గురువారం వెస్ట్ బ్యాంక్‌లో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ దళాలు తమ పట్టును క్రమంగా పెంచుకుంటున్నాయని, హమాస్‌కు వ్యతిరేకంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తూనే ఉంటాయని అన్నారు.
‘‘మేము ఇప్పుడు గాజా స్ట్రిప్‌ను 60 శాతం నియంత్రిస్తున్నాము. గతంలో 50 శాతం ఉండేది, దశల వారీగా ముందుకు వెళ్తూ 70 శాతాన్ని ఆధీనంలోకి తీసుకుంటాము’’ అని నెతన్యాహూ అన్నారు. అక్టోబర్ 07, 2024 దాడుల తర్వాత గాజాలోని హమాస్‌పై ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజా స్ట్రిప్ సర్వనాశనమైంది. ఇజ్రాయిల్ సైన్యం అంతర్జాతీయ సంస్థలకు ఏప్రిల్‌లో అందించిన మ్యాపుల ప్రకారం.. గాజాలో 64 శాతం ప్రాంతం ఇజ్రాయిల్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు దీనిని 70 శాతానికి పెంచితే మరో 20 లక్షల మందిని తరలించాల్సి ఉంటుంది.
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
2025 అక్టోబర్‌లో ఇజ్రాయిల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, ఇజ్రాయిల్ సైన్యం ‘‘ఎల్లో లైన్’’ అనే సరిహద్దు వరకు వెనక్కి వెళ్లింది. ఈ ప్రాంతం గాజాలో సుమారు 53 శాతం వరకు ఉండేది. ఇటీవలి కాలంలో ఇజ్రాయిల్ ఈ సరిహద్దును మరింత లోపలికి నెట్టిందని హమాస్ ఆరోపిస్తోంది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని విమర్శిస్తోంది. ఇదిలా ఉంటే, మరోవైపు లెబనాన్‌లోని హిజ్బొల్లాపై కూడా ఇజ్రాయిల్ దాడుల్ని పెంచింది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!