US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
- అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం..
- ట్రంప్ అనుమతి కోసం ఎదురుచూపులు..
- అంతర్జాతీయ మీడియా నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు దేశాలు కూడా తాత్కాలిక శాంతి ఒప్పందానికి సిద్ధమైనట్లు ఆక్సియోస్ నివేదిక వెల్లడించింది. అయితే, ఈ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది ఆమోదం తెలపాల్సి ఉంది. ఇంకా రెండు రోజులు ఆలోచించాలని అనుకుంటున్నట్లు ట్రంప్, మధ్యవర్తులుగా ఉన్న దేశాలకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు 60 రోజుల తాత్కాలిక అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) రూపొందించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం, ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ పొడగించడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమాలపై చర్చలు తిరిగి ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఒప్పందంలోని చాలా అంశాలపై రెండు దేశాలు అంగీకరిచాయని, ఇరాన్ నాయకత్వం కూడా దీనికి ఆమోదం తెలపిందని, అయితే ట్రంప్ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
ఈ డీల్‌లో భాగంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని పూర్తిగా స్వేచ్ఛాయుత నౌకాయానానికి అనుమతించడం, 30 రోజుల్లో సముద్రంలో సీమైన్లను ఇరాన్ తొలగించాల్సి ఉంటుంది. వాణిజ్య నౌకలకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదని, దీనికి ప్రతిగా అమెరికా తన నౌకాదళ ఆంక్షల్ని క్రమంగా సడలించుకుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ 60 రోజులు ఇరాన్ తన అణు ఆయుధాల అభివృద్ధి కొనసాగించమని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. శుద్ధి చేసిన యురేనియంపై భవిష్యత్తులో రెండు దేశాలు చర్చించనున్నాయి. విదేశీ బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులు, ఆర్థిక ఆంక్షల సడలింపు వంటివి చర్చల్లో భాగం కానున్నాయి.
అయితే, ఈ ఒప్పందం తాత్కాలికమే అని, పూర్తిస్థాయి డీల్ కాదని అధికారులు చెబుతున్నారు. ఒక పక్క శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయి. అమెరికా ఇరాన్ డ్రోన్ కేంద్రాలపై దాడులు చేసింది. ఇరాన్ కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసింది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?