Bhagiratha Jayanthi: భగీరథ మహర్షి జయంతి సందర్బంగా క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా భగీరథ మహర్షి చిత్రపటానికి ముఖ్యమంత్రి జగన్ నివాళులు అర్పించారు. కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన భగీరథ మహర్షి జయంతిని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎవరైనా కష్టపడి పట్టుదలతో అనుకున్నది సాధిస్తే.. వారిని భగీరథునితో పోలుస్తారని, కఠోర శ్రమ చేసి దేన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశాడని కొనియాడుతారని సీఎం అన్నారు.
Read Also: YS Viveka Case: వైఎస్ వివేకా కేసు.. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు
ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఏపీ సగర, ఉప్పర వెల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ జి.రమణమ్మ, గిద్దలూరు వైఎస్‌ఆర్‌సీపీ పరిశీలకుడు బంగారు శీనయ్య, ,ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.