Minister Kakani Govardhan Reddy: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌కు 10 పంటలు చూపిస్తే అందులో ఐదు పంటలను గుర్తించలేడని విమర్శించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. పంటలు ఎలా పండిస్తారో కూడా పవన్‌కు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో రైతులకు ఆనవాయితీగా ఇచ్చే ఇన్‌పూట్ సబ్సిడీని ఎగనామం పెట్టారని, సీడ్ బకాయి, ధాన్యం కొనుగోళ్లు బకాయిలు కలిపి సుమారు 5 వేల కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉందని ఆరోపించారు. . ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను చూసి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, రొటీన్ గానే కొనుగోళ్లు జరుగుతున్నాయని అన్నారు. వ్యవసాయం గురించి మాకు పూర్తిగా తెలుసని. చంద్రబాబు, పవన్‌లకే ఏమీ తెలియదని మంత్రి కాకాణి విమర్శించారు.
Read Also: KTR tour in UK: క్యూలో నిల్చున్న కేటీఆర్.. ఆసక్తిగా వీక్షించిన ప్రయాణికులు
“జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు 10 పంటలు చూపిస్తే అందులో ఐదు పంటలను గుర్తించలేడు. పంటలు ఎలా పండిస్తారో ఆయనకు తెలియదు. టీడీపీ హయాంలో రైతులకు ఆనవాయితీగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారన్నారు. సీడ్ బకాయి, ధాన్యం కొనుగోళ్ల బకాయిలు కలిపి సుమారు రూ.5,000 కోట్లు పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను చూసి ధాన్యం కొనుగోలు చేయడం లేదు. వ్యవసాయం గురించి మాకు పూర్తిగా తెలుసు. వారికే ఏమీ తెలియదు.” -మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి