రేపు సచివాలయంలో జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలో ప్రభుత్వ నూతన పాలసీలు చర్చకు రానున్నాయి. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నూతన పారిశ్రామిక విధానంలో ప్రణాళికలను రచించారు.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడి వాయుగుండంగా బలపడే అవకాశమున్నందున వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యిందని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె.పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు.
అన్నమయ్య జిల్లా పీలేరు సమీపంలోని బందార్లపల్లెలో ఏనుగుల సంచారం వల్ల రాజారెడ్డి అనే రైతు దుర్మరణం పాలైన ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. ఏనుగుల వల్ల రైతు దుర్మరణం చెందటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. మద్యంపై డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెస్ విధిస్తూ జీవో జారీ చేసింది. మద్యంపై రెండు శాతం సెస్ విధించింది. మద్యం ల్యాండెడ్ రేట్లపై సెస్ విధించేలా ఉత్తర్వులు జారీ చేసింది. సెస్ ద్వారా సుమారు రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.
లిక్కర్ పాలసీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మద్యం తయారీ అమ్మకాన్ని దగ్గర పెట్టుకుని జగన్ అడ్డంగా దోచుకున్నాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. లిక్కర్‌లో 40 వేలకోట్లు దోచుకున్నారని, 60 రూపాయలు వున్న క్వార్టర్ బాటల్ 250కి అమ్ముకున్నాడని విమర్శించారు.
ఏపీ సచివాలయంలో రేపు(అక్టోబర్ 16) ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. కీలకమైన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలిసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
బెజవాడ ఐసీఐసీఐ బ్యాంక్‌లో సీఐడీ విచారణ ముగిసింది. బ్యాంక్ మేనేజర్ నుంచి సీఐడీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. బ్యాంక్ మాజీ ఉద్యోగులు నరేష్, గోల్డ్ కౌన్సిలర్ మహేష్, నరసరావు పేట బ్రాంచ్ మాజీ ఉద్యోగి కరుణాకర్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడూ స్పెషల్ సీఎస్ సిసోడియా పర్యవేక్షిస్తున్నారు. భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లకు ఆయన సూచనలు చేశారు.
ఈ ప్రాజెక్ట్ మన దేశానికి అత్యంత ఉపయోగకరమైనదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. నేడు అబ్దుల్ కలాం జయంతి ఈ రోజు శంకుస్థాపన పనులు ప్రారంభించడం హర్షణీయమని ఆయన అన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వు ఫారెస్ట్‌లో రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో రక్షణ మంత్రి మాట్లాడారు.
పార్టీ పవర్‌లో ఉండి, తాను పదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా హోదా వెలగబెట్టినప్పుడు కన్ను మిన్ను కానరాలేదట ఈ లీడర్‌కి. నియోజకవర్గంలో బిల్డప్ బాబాయ్ మాటలు చాలానే చెప్పారట. ఏ విషయం మాట్లాడినా... ఓస్ అంతేనా అంటూ... అసలు బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ తర్వాత నేనే అన్నంతగా గొప్పలకు పోయారట. తీరా ఎంపీ టిక్కెట్ అడిగినా ఇవ్వకపోయేసరికి సిగ్గుబోయి నియోజకవర్గానికి ముఖం చాటేసిన ఆ నాయకుడు ఎవరు? ఏంటాయన ఎకసెక్కాల యవ్వారం?