ఇటీవల విమానాల్లో ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్‌లపై లైంగిక వేధింపుల పర్వానికి తెర పడటం లేదు. దుబాయ్-అమృత్‌సర్ విమానంలో మత్తులో ఎయిర్‌హోస్టెస్‌పై వేధింపులకు పాల్పడినందుకు ఓ ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
తమిళనాడులోని విల్లుపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో నకిలీ మద్యం సేవించి ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి చెందినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.విలుపురం జిల్లాలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందడంతో గ్రామస్థులు రోడ్డును దిగ్బంధించారు.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్‌లలో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో దర్యాప్తులో భాగంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఈ కేసు పాకిస్థాన్ కమాండర్లు లేదా హ్యాండ్లర్ల ఆదేశానుసారం వివిధ నకిలీ పేర్లతో పనిచేస్తున్న టెర్రర్ గ్రూపులు, టెర్రర్ ఫండింగ్, నేరపూరిత కుట్రకు సంబంధించినది.
ప్రశాంతంగా ఉన్న మణిపూర్‌లో రిజర్వేషన్లు చిచ్చుపెట్టాయి. రాష్ట్ర జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీ తెగ ప్రజలకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ ఈ నెల 3న ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. అల్లర్లతో రాష్ట్రం అట్టుడికింది.
ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే, కేకేఆర్ మ్యాచ్‌లో ఒక అద్బుత దృశ్యం చోటుచేసుకుంది. ఆదివారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయిన సంగతి తెలిసిందే. టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ సీఎస్కే కెప్టెన్ ధోనీని ఆటోగ్రాఫ్ అడగడం ఆసక్తి కలిగించింది.
దేశద్రోహ నేరం కింద వచ్చే పదేళ్లపాటు తనను జైల్లో ఉంచాలని ఆ దేశ శక్తివంతమైన పాక్ మిలిటరీ ప్లాన్ చేస్తోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం పేర్కొన్నారు. అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి రూ.5 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో ఈ నెల 9న పారామిలిటరీ రేంజర్లు ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి.
మెక్సికోలో జరిగిన ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్యాసింజర్ వ్యాన్, సరుకు రవాణా ట్రక్కు ఢీకొన్న ఘటనలో 26 మంది మరణించినట్లు ఉత్తర సరిహద్దు తమౌలిపాస్ రాష్ట్ర పోలీసులు ధ్రువీకరించారు.