విజయవాడలోని కృష్ణా తీరంలో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. జాతీయ డ్రోన్ సమ్మిట్‌లో భాగంగా పున్నమి ఘాట్‌లో అతిపెద్ద డ్రోన్ షోను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. కృష్ణా నది తీరంలో 5,500 డ్రోన్‌లతో భారీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. డ్రోన్ షోతో పాటు లేజర్ షోను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో చేపట్టిన అన్ని రైల్వే ప్రాజెక్టులు నిర్దేశిత లక్ష్యంతో త్వరితగతిన పూర్తి చెయ్యాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో మొత్తం రూ.72 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు చేపట్టేందుకు తాము సిద్దంగా ఉన్నామని కేంద్ర రైల్వే మంత్రి తెలిపారని.. దానికి అనుగుణంగా ప్రాజెక్టులు చేపట్టి, వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సీఎం అన్నారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో రైల్వే లైన్ల పనులు, భూసేకరణ, ఆర్థిక అవసరాలు వంటి అంశాలపై రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు.
ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కోరారు ఏపీ పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ..రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఖట్టర్ తో నారాయణ భేటీ అయ్యారు..ఈ భేటీలో మంత్రి నారాయణతో పాటు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కూడా పాల్గొన్నారు..
ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి.. అనంతరం తాడేపల్లి ప్రాతూరులోని వంగవీటి రాధా ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీని ఆయన స్వగృహంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పరామర్శించారు. ఆంధ్ర ఉద్యమంలో ప్రజా ఉద్యమంలో యలమంచిలి శివాజీతో కలిసి పని చేశానని ఆయన తెలిపారు. సిద్ధాంతపర రాజకీయలు చేయకుండా కుల రాజకీయాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారని.. రాజకీయాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని వెంకయ్యనాయుడు అన్నారు.
ఓటు హక్కు వినియోగ ఆవశ్యకతపై ఓటర్ల చైతన్యం, అవగాహన ప్రచారంలో ఉత్తమంగా కృషి చేసిన మీడియా సంస్థలకు-2024 పేరిట భారత ఎన్నికల సంఘం మీడియా అవార్డులను ప్రదానం చేసేందుకు వివిధ మీడియా సంస్థల నుండి ఎంట్రీలను ఆహ్వానిస్తోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మద్యం డిస్టలరీల్లో సీఐడీ బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో వివిధ డిస్టలరీల్లో ఉత్పత్తి చేసిన మద్యం లెక్కలపై సీఐడీ బృందాలు ఆరా తీస్తోంది. డిస్టలరీల నుంచి నేరుగా నేతలకు మద్యం సరఫరా చేశారనే కోణంలో పరిశీలిస్తున్నారు. డిస్టలరీల యాజమాన్యం వెనుక బినామీలు ఉన్నారానే కోణంలో విచారణ జరుగుతోంది.
ఢిల్లీలో రెండో రోజు ఏపీ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సమావేశమయ్యారు.