మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సూపర్ సిక్స్ లో భాగంగా తొలిఅడుగు అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మహిళా సాధికారతలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపావళి రోజున ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న మహిళలకు మూడు గ్యాస్ కంపెనీల ద్వారా అందిస్తున్నామన్నారు. అక్టోబర్ 31న డెలివరీ జరిగేలా చూడాలని సీఎం చెప్పారని వెల్లడించారు.
ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్ అధికారి అనురాధ నియామకమయ్యారు. ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్ అనురాధను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
కడప జిల్లా బద్వేల్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. యువకుడి చేతిలో హత్యకు గురైన యువతి కుటుంబసభ్యులను జగన్ పరామర్శించారు. శనివారం ఘటన జరిగితే ఎవరు పట్టించుకోలేదని.. కేవలం తాను వస్తున్నాను అని బాధితులకు సహాయం అందించారని ఆయన అన్నారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ, ప్రజలకు భరోసా లేదని తీవ్రంగా మండిపడ్డారు.
ప్రేమించానని మాయ మాటలు చెప్పి ప్రేమలోకి దించాడు. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా శ్వాస, నువ్వే నా జీవితం అంటూ కల్లిబొల్లి కబుర్లు చెప్పి దాదాపు ఏడేళ్లు ఆ అమ్మాయితో కలిసి తిరిగాడు. చివరకు పెళ్లి చేసుకుందామని అమ్మాయి అడగగానే ఏదో ఒకటి సాకు చెప్పుకుంటూ, లైఫ్ ఎంజాయ్ చేద్దామంటూ దాట వేసుకుంటూ వచ్చాడు. చివరకు ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇదేంటి అని ప్రేమించిన అమ్మాయి గట్టిగా నిలదీస్తే.. అసలు రూపాన్ని బయటపెట్టాడు ఆ ప్రియుడు.
కృష్టా తీరంలో జరిగిన అమరావతి డ్రోన్ షో సందర్శకులను అబ్బురపరిచింది. అమరావతి డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ధ్రువపత్రాలను అందించారు. లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్ పేరిట మొదటి రికార్డు సాధించగా.. లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టికి రెండో రికార్డు అందుకుంది. లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్ పేరిట మూడో రికార్డును డ్రోన్ షో నెలకొల్పింది. డ్రోన్ల ద్వారా అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శనతో నాలుగో రికార్డును సాధించింది. ఏరియల్ లోగోతో ఐదో రికార్డును అమరావతి డ్రోన్…
తెలంగాణ గ్రూప్ వన్ ఎపిసోడ్‌లో వెనుకబడ్డామని బీఆర్‌ఎస్ ఫీలవుతోందా? ఆ విషయంలో బీజేపీ ఓ అడుగు ముందుకేయగలిగిందని, తాము ఇంకొంచెం యాక్టివ్ అవగలిగితే బాగుండేదన్న చర్చ పార్టీలో జరుగుతోందా? అందుకే కరెంట్ ఛార్జీల విషయంలో అలర్ట్‌గా ఉండాలని పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపిందా? క్రెడిట్ వార్‌లో గులాబీ దళం ఎక్కడుంది? ఆ పార్టీ అధిష్టానం మనసులో ఏముంది?
రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలకమైన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకం విధి విధానాలకు ఆమోద ముద్ర వేయనున్నారు.
నిన్న మొన్నటిదాకా సింహపురి టీడీపీలో ఆయన చెప్పిందే వేదం. మంత్రుల్ని కూడా కాదని బదిలీలు, పోస్టింగ్స్ కోసం ఆయన దగ్గరికే పరుగులు పెట్టేవారట ప్రభుత్వ సిబ్బంది. కానీ... ఉన్నట్టుండి సీన్ మొత్తం మారిపోయింది. మౌన ముద్ర దాల్చారానేత. ఇంకా చెప్పాలంటే... అసలు నెల్లూరుకే ముఖం చాటేశారట. ఎవరా నేత? ఎందుకా మార్పు? ఆయన అనుచరులేమంటున్నారు?
గుంటూరు జిల్లాలోని తెనాలిలో నవీన్ అనే యువకుడు దాడి లో తీవ్ర గాయాలపాలై బ్రెయిన్ డెడ్‌కు గురైన సహానా మృతి చెందింది. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సహానా ప్రాణాలు విడిచింది. మృతురాలు సహానాకు నిందితుడు నవీన్‌కు ప్రేమ వ్యవహారం ఉంది.