ఈ ఆధునిక యుగంలో ఇంకా శిశువులను అంగడి సరుకుల మాదిరిగా విక్రయిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శిశు విక్రయాల గతంలో అనేక ప్రాంతాల్లో వెలుగు చూశాయి. నవ మాసాలు మోసి కన్నబిడ్డలను తమ అవసరాల కోసం అమ్మేస్తున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పసి బిడ్డ విక్రయం ఘటన బాపట్లలలో చోటుచేసుకుంది.
అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టేందుకు ఆమోదం లభించింది. కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది.
విజయనగరం జిల్లా గుర్లలో తీవ్రస్థాయిలో డయేరియా వ్యాధి ప్రబలటానికి (Acute Diarrheal Disease-ADD) దారితీసిన కారణాలు, భవిష్యత్తులో అట్టి పరిస్థితిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల బృందం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా మంత్రిత్వ శాఖకు సమగ్ర నివేదికను అందజేసింది. ఇద్దరు జనరల్ మెడిసిన్ వైద్యులు, కమ్యూనిటీ మెడిసిన్, మైక్రోబయాలజీ, పీడియాట్రిక్స్ నిపుణులు, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్‌లతో కూడిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీం మంగళవారం సాయంత్రం మంత్రిత్వ శాఖకు నివేదికను అందచేసింది.
పిలిచి పిల్లనిస్తామంటే పెళ్ళి కూతురు గురించి తేడాగా మాట్లాడినట్టు ఉందట అక్కడి వ్యవహారం. వైసీపీ అధిష్టానం ఏరికోరి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తే.... తీరా ఓడిపోయాక ఉన్నారో లేరో కూడా అడ్రస్ లేకుండా పోయారా నేతలు. భరోసా ఇచ్చే లీడర్ లేక కేడర్ కూడా కన్ఫ్యూజ్‌లో ఉందట. అంత తేడాగా ప్రవర్తిస్తున్న ఆ లీడర్స్ ఎవరు? ఎందుకలా జరుగుతోంది?
భక్తుల దర్శనాలపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2 నుండి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో కార్తీక శని, ఆది,సోమ,పౌర్ణమి,ఏకాదశి రోజులలో సామూహిక,గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను శ్రీశైలం దేవస్థానం రద్దు చేసింది.
Minister Nara Lokesh: రాష్ట్రంలోని పాఠశాలల్లో కొత్తగా అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.6,762 కోట్లు మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని కలిసిన మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని పాఠశాలలకు సంబంధించి పలు వినతిపత్రాలను సమర్పించారు. రాష్ట్రంలోని 32,818 పాఠశాలల్ల్లో తరగతి గదుల మరమ్మతులు, టాయ్ లెట్లు, తాగునీటి […]
పారిశ్రామికరంగాన్ని గాడిలో పెట్టి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈనెల 25వ తేదీనుంచి వారంరోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్రంలోని కోట్లాదిమంది యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశం.
ఐఎండీ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘దానా’ తుఫాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో వాయవ్య దిశగా కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ వెల్లడించారు. బుధవారం సాయంత్రానికి పారాదీప్ (ఒడిశా)కి 460 కిమీ., ధమ్రా(ఒడిశా)కు 490 కిమీ.,సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 540 కిమీ దూరంలో కేంద్రీకృతమైందన్నారు.
ఏపీలో ఇసుక విధానంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పుల వల్ల ఎన్జీటీ పెనాల్టీలు వేసిందన్నారు. అప్పట్లో ప్రభుత్వం మీద ఎన్జీటీ పెనాల్టీలు విధించిందని తెలిపారు. 35 లక్షల టన్నులు పారదర్శకంగా అప్పట్లో మేం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఇచ్చామన్నారు